కల్యాణం.. కమనీయం
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:15 AM
అత్తిలిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.
సుబ్రహ్మణ్యేశ్వర షష్టి ఉత్సవాలు
అత్తిలి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : అత్తిలిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అత్తిలికి చెందిన కూనపరెడ్డి తేజ, విజయలక్ష్మి దంపతులు స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఐలూరి శ్రీరామం, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కల్యానం జరిపారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కురెళ్ళ ఉమామహేశ్వరరావు, కార్యదర్శి దాడి శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు దిరిశాల మాధవరావు, కోశాధికారి ఇర్రి వెంకట సత్యనారాయణ, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మె ల్యే పుప్పాల వాసుబాబు, యడ్లపల్లి భద్రం, మద్దాల శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ బుద్దరాతి భరణి ప్రసాద్ పాల్గొన్నారు.
సింగరాయపాలెంలో వధూవరులుగా..
ముదినేపల్లి: మండలంలోని సింగరాయపాలెం చేవూరుపాలెం సెంటర్‌లో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో షష్టి, స్వామి వారి కల్యాణ మహోత్సవా లు శుక్రవారం ప్రారంభమ య్యాయి. స్వామివారిని, అమ్మవార్లను పెండ్లి కుమా రుడు, పెండ్లి కుమార్తెలను చేసి పూజలు నిర్వహిం చారు. మంగళ వాయిద్యా లు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామి వార్లను నూతన వస్త్రాలతో అలంకరించి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఆర్.గంగా శ్రీదేవి ఆధ్వర్యంలో అర్చకులు తోలేటి వీరభద్ర శర్మ, కోట శివశంకర శర్మ పూజలు అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం విఘ్నేశ్వరపూజ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ కార్యక్రమాలను జరిపారు. ఉత్సవాలకు నియమించిన ఉత్సవ కమి టీ సభ్యులు ఆలయంలో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. కమిటీ సభ్యులను అసిస్టెంట్ కమీషనర్ సత్కరించారు. సర్పంచ్ పరసా విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. షష్టి ఉత్సవాల సందర్భంగా దేవస్థానం వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కైకలూరు సీఐలు రవికుమార్, కృష్ణ ఆధ్వర్యంలో సుమారు 70 మంది సిబ్బంది బందోబస్తు నిర్వ హిస్తున్నట్లు ఎస్‌ఐ వీరభద్రరావు తెలిపారు.
Updated Date - Dec 07 , 2024 | 12:18 AM