ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పశువుల లెక్క తేల్చేలా..

ABN, Publish Date - Nov 07 , 2024 | 12:53 AM

పాడి రైతుల సంక్షేమం, పశు సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులే స్తోంది. వచ్చే ఐదేళ్లలో వీటి సంఖ్య ఆధారం గా నిధుల కేటాయింపు, పశుపోషణ, పశు వైద్యశాలల ఏర్పాటుకు వీలుగా పశుసంవ ర్థక శాఖ ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇం టింటి సర్వే చేపట్టింది.

జిల్లాలో పశుగణన ప్రారంభం

5.25 లక్షల ఇళ్లను సర్వే చేస్తున్న 248 మంది సిబ్బంది

పిల్లి మినహా.. 16 రకాల జంతువుల లెక్కింపు

నరసాపురం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): పాడి రైతుల సంక్షేమం, పశు సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులే స్తోంది. వచ్చే ఐదేళ్లలో వీటి సంఖ్య ఆధారం గా నిధుల కేటాయింపు, పశుపోషణ, పశు వైద్యశాలల ఏర్పాటుకు వీలుగా పశుసంవ ర్థక శాఖ ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇం టింటి సర్వే చేపట్టింది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు జిల్లాలోని 5.25 లక్షల ఇళ్లకు వెళ్లి చేస్తారు. ఈ మేరకు 248 మంది సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. పిల్లి మినహా... మిగిలిన ఆవులు, గేదేలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, పందులు, పెంపుడు కుక్కలు, వీధి కుక్కల మొదలైన 16 రకాల పశువుల వివరాలను నమోదు చేయను న్నారు. జంతువుల లింగ, వయసు, జాతి వివరాలను సిబ్బంది సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ గణన వల్ల పాడి రైతులకు మేలు జరగనుంది. ఎన్నికల్లో కూటమి పార్టీలు పాడి రైతులకు చేయూత నిస్తామని హామీ ఇచ్చాయి. దీనికనుగుణం గా ఆవులు, మేకలు, గేదెలు, గొర్రెల లెక్కలు తేలనున్నాయి. వీటి ఆధారంగా రైతులకు సబ్సిడీలు అందించి పాడి పరిశ్రమను పెం చేందుకు అవకాశం ఉంటుంది. గొర్రెల పెంపకందారులు, వాటి సంఖ్యను ఈ సర్వే ద్వారా తేలనుంది. ఆవులు, గేదెల రకాలు, వాటి సంఖ్య స్పష్టం కానుంది. జిల్లావ్యా ప్తంగా రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి జరుగుతుందోనన్న లెక్క తేలుతుంది. ఏ గ్రామాల్లో ఎన్ని పశువులు ఉన్నాయో, ఎక్కడ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలన్నది సులభతరం అవుతుంది. జిల్లాలో ఈ సర్వే చేపట్టి ఐదేళ్లు పూర్తయింది. మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. 2020లో జరిగిన లెక్కల ప్రకారం.. ఆవులు 45,539, గేదెలు 1,78,137, గొర్రెలు 38,840, మేకలు 22,765, పందులు 1,000, కోళ్లు 34,66,000, పాలు ఇచ్చే ఆవులు 27,323, పాలు ఇచ్చే గేదెలు 1,06,882 ఉన్నాయి.

Updated Date - Nov 07 , 2024 | 12:53 AM