మునిసిపల్ టీచర్లకు ప్రమోషన్లు
ABN, Publish Date - Oct 28 , 2024 | 11:39 PM
పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాఽ ద్యాయులకు తీపికబురు.
ఏలూరు అర్బన్, అక్టోబరు 28 (ఆంద్రజ్యోతి) : పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాఽ ద్యాయులకు తీపికబురు. ఏళ్ళతరబడి బదిలీలు, పదోన్నతుల కోసం డిమాండ్ చేస్తున్న మునిసి పల్ టీచర్ల ఆకాంక్షలకు కార్యరూపమిస్తూ కూట మి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ మేరకు మునిసిపల్ టీచర్ల పదోన్నతులకు సంబందిం చిన ప్రక్రియను ప్రారంబించాల్సిందిగా ఉన్నతాధి కారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికనుగుణంగా ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా ప్రాతిపదికగా ఏలూరుజిల్లా డీఈవో నేతృత్వంలో పదోన్నతుల ప్రక్రియను చేపట్టారు.
ఉమ్మడి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్, నిడదవోలు, నరసాపురం, తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు మునిసి పాలిటీల్లో మొత్తం 230 ప్రాథమిక, ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాలలుండగా, వీటిలో సుమారు 1400మంది టీచర్లు పని చేస్తున్నారు. కూటమిప్రభుత్వం కొలువుతీరాక చేపడుతున్న మెగా డీఎస్సీ–2024 రిక్రూట్‌మెంట్‌లో మునిసి పల్ పాఠశాలలకు చెందిన టీచర్ పోస్టుల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ కేడర్ల నుంచి దాదాపు 260 వెకెన్సీలను చేర్చినట్టు సమాచారం. మెగా డీఎస్సీకి చేర్చినవాటిలో 2025 మే నెలాఖరు వరకు ఏర్పడే వెకెన్సీలను కూడా చేర్చగా, ఇపుడు మిగతా ఖాళీలకు మాత్రమే పదోన్నతు లను ఇచ్చేఅవకాశం ఉంది. దీనిపై విద్యాశాఖ నుంచి స్పష్టత రావాల్సిఉంది. వర్కింగ్ ఎస్జీటీల నుంచి తగిన అర్హతలున్నవారికి ఆయా సబ్జెక్టుల్లో అందుబాటులోవున్న ఖాళీలమేరకు స్కూల్ అసి స్టెంట్ పదోన్నతులు ఇవ్వడంద్వారా భర్తీచేయను న్నారు. ఆ ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఏలూరు నగరపాలకసంస్థలో 7 హైస్కూళ్ళు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, భీమవరం మునిసిపాలిటీల్లో 6 చొప్పున, నరసాపురం 5, నిడదవోలు 3, తణుకు, కొవ్వూరు మునిసిపాలిటీల్లో ఒకొక్కటి చొప్పున హైస్కూళ్ళలో అందుబాటులోవున్న ఖాళీల మేర కు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతులు ఇవ్వడంద్వారా భర్తీచేస్తారు. జంగారెడ్డిగూడెం, ఆకివీడు మునిసిపాలిటీలుగా వర్గోన్నతి అయిన ప్పటికీ, ఇంతవరకు అక్కడి పాఠశాలలను మా త్రం పురపాలకశాఖ పరిధిలోకి రాష్ట్రస్థాయిలో తీసుకురాలేదు. మరోవైపు ఏలూరు కార్పోరేషన్ పరిధిలోకి పరిసర గ్రామాలను కూడా గతంలోనే చేర్చినప్పటికీ, సంబందిత ప్రాంతాల్లోని స్కూళ్ళు మాత్రం పంచాయతీరాజ్ పరిధిలోనే కొనసాగు తున్నాయి. ఇక తాజాగా మునిసిపల్ పాఠశాలల టీచర్లకు ఇవ్వడానికి ఉద్దేశించిన పదోన్నతులు మెగా డీఎస్సీకి చేర్చిన పోస్టులను మినహాయిస్తే ఉమ్మడి జిల్లాలో సుమారు 14 వరకు మాత్రమే ఉంటాయని ప్రాథమిక అంచనా. ఈ పదోన్న తులు మునిసిపాలిటీ లవారీగా ఎన్నెన్ని ఉంటా యనేదానిపై ఒకటిరెండురోజుల్లో స్పష్టత రానుంది.
వచ్చే నెలలో ప్రమోషన్లు
అర్హులకు ప్రమోషన్లను నవంబరు మొదటి వారంలో ఇస్తారు. కాగా పదోన్న తుల ప్రక్రియ ప్రకారం ఉమ్మడిజిల్లాలోని మున్సిపల్ టీచర్ల సీనియార్టీ జాబితాలు సోమవారమే విడుదల కావాల్సిఉండగా, కొత్తగా బదిలీపై జిల్లాకు నియమితులైన ఎం.వెంకటలక్షమ్మ ఇంకా బాధ్యతలు చేపట్ట కపోవడంతో ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని జాబితాలను మంగళ లేదా బుధవారం విడుదలచేసే అవకాశం ఉంది. నూతన డీఈవో వెంకటలక్ష్మమ్మ జిల్లాలో బుధవారం విధుల్లో చేరతారని తెలిసింది.
Updated Date - Oct 28 , 2024 | 11:39 PM