ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

306 మంది సర్‌ప్లస్‌ టీచర్లకు ‘సర్దుబాట్లు’ నుంచి ఉపశమనం

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:08 AM

సుదీర్ఘంగా సాగిన సర్‌ప్లస్‌ టీచర్ల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ కౌన్సెలింగ్‌ బుధవారంతో ముగిసింది. తుదివిడతగా జిల్లాలోని 28 మండలాల్లో సర్‌ప్లస్‌ ఎస్జీటీలుగా వున్న 200 మందిని అదే మండలపరిధిలో కొరతవున్న పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

రేపు నూతన స్థానాల్లో విధుల్లో చేరేందుకు నియామకపత్రాల జారీ

జిల్లాలో ముగిసిన వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ కౌన్సెలింగ్‌

ఏలూరు అర్బన్‌, సెప్టెంబరు 4 : సుదీర్ఘంగా సాగిన సర్‌ప్లస్‌ టీచర్ల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ కౌన్సెలింగ్‌ బుధవారంతో ముగిసింది. తుదివిడతగా జిల్లాలోని 28 మండలాల్లో సర్‌ప్లస్‌ ఎస్జీటీలుగా వున్న 200 మందిని అదే మండలపరిధిలో కొరతవున్న పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇందులో 160 మంది ఎస్జీటీలు అదే కేడర్‌లోని వెకెన్సీలను కోరుకోగా, ఇంకా మిగిలిపోయిన 40 మందిని ప్రస్తుత స్థానాలకే వెనక్కి పంపివేశారు. ఆ ప్రకారం ఏలూరు జిల్లాలో మొత్తం 805 మంది ఉపాధ్యాయులను సర్‌ప్లస్‌ టీచర్లుగా గుర్తించిన విషయం విధితమే. జిల్లాలో మొత్తం 499 స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ వేకెన్సీలను ఆయా మండలాల్లోని పాఠశాలల్లో గుర్తించి సర్దుబాట్లు చేపట్టగా, హిందీ, బయోలాజికల్‌ సైన్స్‌, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో తగినంతమంది అర్హులు లేక 420 వేకెన్సీలను మాత్రమే ఆయా కేడర్లలో భర్తీ చేయగలిగారు. తొలుత స్కూల్‌ అసిస్టెంట్లకు మండల, డివిజన్‌ స్థాయిల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి సర్దుబాట్లు చేశారు. అనంతరం బుధవారం ఒక్కరోజులోనే సర్‌ప్లస్‌ ఎస్జీటీలందరినీ మండల స్థాయిలో అడ్జస్ట్‌ చేశారు. కౌన్సెలింగ్‌ అనంతరం జిల్లాలో మొత్తంమీద వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌కు 805 మంది సర్‌ప్లస్‌ టీచర్లను గుర్తించినప్పటికీ వివిధ కారణాల వల్ల సుమారు 306 మందిని ప్రస్తుత స్థానాలకే తిరిగి వెనక్కి పంపించి వేయడంతో సంబందిత ఉపాధ్యాయులందరికీ ప్రయోజనం లభించినట్టయింది. మండల, డివిజన్‌స్థాయి కౌన్సెలింగ్‌లలో నూతన స్థానాలను కోరుకున్న స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలందరూ సంబంధిత స్కూళ్ళలో శుక్రవారం సాయంత్రంలోగా విధుల్లో చేరేందుకు వీలుగా నియామక పత్రాలు కూడా జారీ చేశారు.

Updated Date - Sep 05 , 2024 | 12:08 AM

Advertising
Advertising