పర్యాటకానికి పునరుజ్జీవం
ABN, Publish Date - Nov 27 , 2024 | 12:21 AM
గోదావరి జిల్లాలు పేరు వినగానే పర్యాటకులకు గుర్తొచ్చేది.. పచ్చదనం, కేరళ తరహా అందాలు, గోదావరి పరవళ్లు, పాపికొండలు, ఆధ్యాత్మికంగా నిలిచే ద్వారకా తిరు మల, భీమవరం మావుళ్ళలమ్మ, పేరుపాలెం బీచ్, వశిష్ఠా గోదావరిలో బోటు ప్రయాణాలు, రిస్టార్ట్స్. తెలుగు రాష్ర్టాల ప్రజలు డిసెంబర్, జనవరి నెలలు వచ్చాయంటే అరకకు అందాలు లేదా గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందాలు తిలకించేందుకు మక్కువ చూపుతుంటారు.
రూ.200 కోట్లతో ప్రతిపాదనలు
టూరిజం హబ్‌గా ఉమ్మడి పశ్చిమ
పోలవరం నుంచి బియ్యపుతిప్ప వరకు టూరిజం ప్రాజెక్టులు
నరసాపురం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గోదావరి జిల్లాలు పేరు వినగానే పర్యాటకులకు గుర్తొచ్చేది.. పచ్చదనం, కేరళ తరహా అందాలు, గోదావరి పరవళ్లు, పాపికొండలు, ఆధ్యాత్మికంగా నిలిచే ద్వారకా తిరు మల, భీమవరం మావుళ్ళలమ్మ, పేరుపాలెం బీచ్, వశిష్ఠా గోదావరిలో బోటు ప్రయాణాలు, రిస్టార్ట్స్. తెలుగు రాష్ర్టాల ప్రజలు డిసెంబర్, జనవరి నెలలు వచ్చాయంటే అరకకు అందాలు లేదా గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందాలు తిలకించేందుకు మక్కువ చూపుతుంటారు. రెండు నెలల ముందుగానే రూమ్‌లు బుక్ చేసుకుంటారు. జిల్లాకు పర్యాట కంగా ఇంతటి ప్రాధాన్యత ఉన్నది. ఇక సినిమా రంగానికి కూడా జిల్లా పెట్టింది పేరు. రంగస్థలం వంటి ఎన్నో హిట్ సినిమాలు జిల్లాలో చిత్రీకరించినవే. దానికి అనుగుణంగానే రాష్ట్ర విభజన తరువాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టూరిజానికి పెద్ద పీట వేసింది. పోలవరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పలు ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. కొన్ని పనులు చేపట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇవన్ని నిర్వీ ర్యమయ్యాయి. ఐదేళ్లు టూరిజం ఊసే లేదు. ఉన్న రిస్టార్ట్స్ కూడా మూత పడ్డాయి. పర్యాటకంగా జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగా ంచిన పేరుపాలెం వంటి బీచ్ అంఽథకారంగా మారింది. కొత్తగా ఒక్క రిసార్ట్ కూడా ఇక్కడ నోచుకోలేదు.
పర్యాటకానికి కూటమి ఊపిరి
రాష్ట్ర అభివృద్ధి పర్యాటక రంగంపై కూడా ఆధారపడి ఉందని భావించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే టూరిజానికి పెద్ద పీట వేసింది. గతంలో ప్రతిపాదించిన పెండింగ్ ప్రాజెక్టులు, వాటి పురోగతిపై ఆరా తీసింది. తాజాగా సోమవారం ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మంత్రులు, ఉన్నతాధికారులతో టూరిజం అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు ఊపిరిపోయనున్నట్లు వెల్లడించారు. దీంతో మళ్లీ జిల్లా లోని పర్యాటక ప్రదేశాలకు జీవం పోసినట్లైంది. మంగళ వారం ఉపముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ను కలిసి రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులతో ప్రతిపాదనలు అందించారు దీంతో కేంద్ర సాయంతో టూరిజానికి పెద్ద పీట వేయాలని ప్రభుత్వం యోచిస్తుంది.
రూ.200 కోట్లతో ప్రతిపాదనలు
రాష్ట్ర విభజన తరువాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలోని టూరిజం అభివృద్ధికి సుమారు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. వాటిలో పెద్ద పీట పేరుపాలెం బీచ్‌కు వేశారు. సుమారు రూ. 16కోట్లతో రిసార్ట్స్ నిర్మాణం, అలాగే 14 ఎకరాల సీఆర్ జెడ్ భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో రిసార్ట్స్ నిర్మాణం, బీచ్‌కు వెళ్లేందుకు వీలుగా భీమవరం, నరసా పురం నుంచి రహదార్ల ఆభివృద్ధి వంటి పనులు ఉన్నా యి. ఇవి కాకుండా నరసాపురం వద్ద బోట్స్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఇది వైసీపీ హయాంలో మూతపడి ంది. ఇటు ఆచంట, సిద్దాంతం వద్ద చేపట్టిన రిసార్ట్స్ కూడా మధ్యలో నిలిచిపోయాయి. కొల్లేరులో రూ.100 కోట్లతో ప్రతిపాదించిన కాటేజీ, బోట్స్ క్లబ్ అభివృద్ధికి నోచుకోలేదు. పట్టిసీమలో 160 ఎకరాల ఇరిగేషన్ స్థలంలో ప్రతిపాదించిన అగ్రీ టూరి జం కూడా ముందుకు వెళ్లలేదు. గుంటుపల్లి, బుద్ధాకేవ్స్, పోలంవరం వద్ద రిసార్ట్స్ కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ప్రతిపాదనలకు మళ్లీ మంచి రోజులు వస్తాయన్న ఆశ ఉమ్మడి జిల్లా వాసుల్లో నెలకొంది.
ప్రతిపాదనలు సిద్ధం
ప్రభాకర్‌రావు, జిల్లా టూరిజం అధికారి
జిల్లాలో టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పోలవరం నుంచి నరసాపురం వరకు ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. పేరుపాలెం బీచ్‌తో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో రిసార్ట్స్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది పర్యాటకులు దేశ నలుమూలల నుంచి విచ్చేస్తారు. రాష్ట్ర విభజన తరువాత సుమారు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశాం. కొన్ని పనులు ప్రారంభించాం. అయితే వీటిలో చాలా పెండింగ్ పడ్డాయి. మళ్లీ కొత్త ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నాం
Updated Date - Nov 27 , 2024 | 12:25 AM