ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమర్థవంతంగా విధులు నిర్వహించాలి

ABN, Publish Date - Nov 27 , 2024 | 12:07 AM

పోలీస్‌ సబ్‌ ఇనస్పెక్టర్లుగా పదోన్నతి పొందిన అధికారులు సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ.అశోక్‌కుమార్‌ తెలిపారు.

నేర స్థలంలో అంశాలపై సిబ్బందికి శిక్షణ

ఏలూరు రేంజి ఐజీ అశోక్‌కుమార్‌

ముగిసిన పదోన్నతి అర్హత పరీక్షలు

పెదవేగి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ సబ్‌ ఇనస్పెక్టర్లుగా పదోన్నతి పొందిన అధికారులు సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ.అశోక్‌కుమార్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ శిక్షణా కేంద్రం (డీటీసీ)లో పోలీస్‌ ఉద్యోగులకు పదోన్నతి అర్హత పరీక్షలు మంగళవారం ముగిశాయి. ఐజీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఏలూరు రేంజ్‌ పరిధిలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి పదోన్నతుల పరీక్షలు సోమ, మంగళవారం రెండురోజుల పాటు జరిగాయని చెప్పారు. హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు మొత్తం 115 మంది అభ్యర్థులకు ఎస్‌ఐలుగా పదోన్నతు లకు అర్హత పరీక్షలు నిర్వహించామన్నారు. పటి ష్ట భద్రత నడుమ పరీక్షలు జరిగాయని ఆయన చెప్పారు. మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అధికా రుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించామన్నారు. రాత పరీక్షలతోపాటు రెండో రోజు మంగళవారం నేర స్థల పరిశీలన, నేరం జరిగిన విధానం, తీసు కోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలు వివరిం చామన్నారు. పదోన్నతి పరీక్షల్లో అర్హత సాధిం చిన అభ్యర్థులకు కల్యాణ్‌ డ్యామ్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ఆరు వారాల శిక్షణ ఉంటుందని, అనంతరం వారు ఎస్‌ఐలుగా పదోన్నతి పొందు తారని ఆయన వివరించారు. 4వ బెటాలియన్‌ కమాండెంట్‌ సీవీఏ.రామకృష్ణ, ఏలూరు ఏఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు, డీటీసీ డీఎస్పీ సీహెచ్‌వీ. ప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లా ఆర్మ్‌డ్‌ రిజ ర్వుడ్‌ ఏఎస్పీ చెంచురెడ్డి, ఏఆర్‌ ఏఎస్పీ ఎన్‌ఎస్‌ ఎస్‌.శేఖర్‌, రేంజ్‌ పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, మహిళా ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 12:07 AM