గిరిజనులకు ఉద్యోగ నియమకాలు చేపట్టాలి
ABN, Publish Date - Oct 29 , 2024 | 12:29 AM
షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక జీవో తీసుకువచ్చి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, ఆదివాసీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఏజెన్సీ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు.
బుట్టాయగూడెం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక జీవో తీసుకువచ్చి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, ఆదివాసీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఏజెన్సీ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రత్యేక చట్టంతో ఉద్యోగ నియమకాలు చేపట్టాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు రవ్వ బసవరాజు ఆధ్వర్యంలో మండలంలోని ఎంపీపీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సంక్షేమ పరి షత్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్ పివి చలపతిరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం నవంబరులో డీఎస్సీ ప్రకటిస్తున్నం దున ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్సీని ప్రక టించి ఉపాధ్యాయ నియమకాలు చేపట్టాలని కోరారు. ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని సర్పంచ్‌ల ఛాంబ ర్ అధ్యక్షుడు కుంజా వెంకటేశ్వరావు హెచ్చరిం చారు. ఎంపీపీ కారం శాంతి, సర్పంచ్‌లు బన్నె బుచ్చిరాజు, జోడే దుర్గారావు, తెల్లం వెంకాయమ్మ, తాటి రాముడు, ఆదివాసీ నాయకులు తెల్లం లక్ష్మణరావు, సరియం కన్నపరాజు, ఆశోక్, అన్వేష్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
పోలవరం: డిఎస్సీ 2024 ఉపాధ్యాయుల నియామకాలు స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్ర మంలో ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు మండల విధ్యాశాఖ కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. మిడియం వెంకట స్వామి మాట్లాడుతూ జీవో 57 ప్రకారం షెడ్యూల్ ప్రాంతంలో నియామకాలను గిరిజన ప్రాంత అభ్యర్థులతో భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో పాతకోట రామారావు, కుర్సం రమేశ్, కొక్కెర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కుక్కునూరు: ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యా లయం వద్ద ఆందోళన చేపట్టారు. అధ్య క్షుడు కాకి మధు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో డీఎస్సీకి ప్రత్యేక నోటిఫికే షన్ ఇవ్వాలన్నారు. 1990 పూర్వం నుం చి ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాల న్నారు. తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. సంజీవరావు, చినబాబు, వేణుగోపాల్, పాయం సత్యనారాయణ, అశోక్, కిశోర్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Oct 29 , 2024 | 12:29 AM