ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంత అపచారమా

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:27 AM

హిందువుల మనోభావాలకు నిలువుటద్దం తిరుపతి వెంకన్న తియ్యటి లడ్డూ. స్వామి దర్శనానంతరం ప్రతీ ఒక్కరూ అతి పవిత్రంగా భావించి సొంత ప్రాంతా లకు తెచ్చే లడ్డూలో వైసీపీ నాణ్యత లేని కల్తీ నెయ్యిని ఉపయోగించిందంటూ ఆఖరుకి ల్యాబ్‌ పరీక్షల్లోను బయటకు వచ్చిన నిజాలు అందరినీ నివ్వెర పోయేలా చేస్తున్నాయి.

శ్రీవారి లడ్డూ కల్తీపై భక్తుల్లో ఆగ్రహావేశాలు

తప్పు చేసిన వారిని ఆ దేవుడే శిక్షిస్తాడంటూ కామెంట్లు

మతాల మధ్య వైసీపీ చిచ్చుపెట్టే కుట్రలంటూ తీవ్ర అసహనం

నడిరోడ్డులో దోషులను ఉరి తీయాలి : టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని

ఏ ఒక్కరిని వదిలిపెట్టకండి : కృష్ణప్రసాద్‌, బీజేపీ ఏలూరు కన్వీనర్‌

ఆలయాలకు రక్షణ లేదు : వబిలిశెట్టి, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

తిరుమల ఏడుకొండల స్వామిని చూసి తరించడం ఒక ఎత్తయితే.. శ్రీవారి కొండపై లభించే లడ్డూను తెచ్చి నలుగురికి పంచితే అదొక వైభోగం. వయస్సుతో నిమిత్తం లేకుండా లడ్డూ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని మరీ ఆ దేవ దేవుడిని హృదయంలో స్మరించుకుంటారు. అలాంటి మధురా నుభూతి కలిగించే లడ్డూలో కల్తీ జరిగిందని తెలిసి అదికూడా వైసీపీ హయాం నుంచే కొనసాగుతుందనే విషయం బట్టబయలు కావడంతో శ్రీవారి భక్తుల్లో ఆవేదన పెల్లుబుకింది. ఇంత అపచారం చేస్తారా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హిందువుల మనోభావాలకు నిలువుటద్దం తిరుపతి వెంకన్న తియ్యటి లడ్డూ. స్వామి దర్శనానంతరం ప్రతీ ఒక్కరూ అతి పవిత్రంగా భావించి సొంత ప్రాంతా లకు తెచ్చే లడ్డూలో వైసీపీ నాణ్యత లేని కల్తీ నెయ్యిని ఉపయోగించిందంటూ ఆఖరుకి ల్యాబ్‌ పరీక్షల్లోను బయటకు వచ్చిన నిజాలు అందరినీ నివ్వెర పోయేలా చేస్తున్నాయి. ఈ వ్యవహారమంతా బట్టబయలైన క్షణం నుంచే భక్తులంతా ఆగ్ర హంతో ఉన్నారు. వాస్తవానికి గత ఐదేళ్లుగా సామాన్య భక్తులు తిరుపతి వెంకన్న దర్శనం చేసుకోవడమే అతి కష్టంగా మారి గిలగిలలాడారు. రాజకీయ సిఫార్సులతో వెళ్ళే వారంతా క్షణాల్లో దర్శనం ముగించుకోగా సాధారణ భక్తులు అష్టకష్టాలు పడ్డారు. ఒకానొక దశలో తిరుపతి వెంకన్న దర్శనం అదొక ఊహాజనితంగా మారేలా గడిచిన ప్రభుత్వంలో కొందరి పనితీరు స్పష్టంగా కనిపించింది. దూర భారం భరించి దర్శనానికి తరలివెళ్ళినా గదులు దొరక్క కొందరు, కరువైన సౌకర్యా లతో ఇంకొందరు, ఆఖరుకి లడ్డూలను కావాల్సినన్ని తెచ్చుకోవడానికి అవకాశం లేక ఉసూరుమన్నారు. వెంకన్న పట్ల జరుగుతున్న అపచారానికి చెంపలేసుకున్నారు. అప్పట్లో నోరుమెదిపే శక్తిలేక పవిత్ర పుణ్యక్షేత్రంలో వివాదాలకు తావులేకుండా ఎవరంతట వారుగా దర్శనం దొరికితే చాలనుకున్నారు. ప్రసాదంగా లడ్డూ దక్కితే అదే పదివేలు అనుకున్నారు. కాని వైసీపీ సర్కార్‌ శ్రీవారి లడ్డూనే అపవిత్రం చేసేలా వ్యవహరించిందన్న విషయం ఇప్పుడు బయటపడడంతో అందరూ నివ్వెర పోతున్నారు. ప్రసార మాధ్యమాల్లో వెలువడుతున్న వార్తలను చూసి విస్తుపోతున్నారు. తమ నమ్మకాల ను కాలరాసేందుకు ప్రయత్నించారంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. శ్రీవారిపై తమకున్న అపార నమ్మ కాన్ని సైతం జగన్‌ ప్రభుత్వం కాలరాయడం పట్ల వీరంతా ఆగ్రహంతో ఉన్నారు. దేవుడి విషయంలో ఎందుకింత నికృష్టంగా వ్యవహరించారు. ఎక్కడిక క్కడ చేతికందిన నిధులు నొక్కేశారు. ఆఖరుకి తిరు మల వెంకన్న లడ్డూ విషయంలోను ఇంత అప చారమా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడా ఉండవని, కేవలం వైసీపీ మూకల వల్లే ఇది సాధ్యమైందనే భావనే అందరిలోను ఉంది.

వెంకన్నా.. క్షమించు

తిరుపతి వెంకన్న లడ్డూ తయారీలో అపచారం జరిగిందన్న సమాచారం వెల్లువెత్తగా ఎక్కడికక్కడ మహిళలు సైతం ఈ సంఘటనపై శాపనార్థాలు పెడుతున్నారు. వెంకన్న.. మమ్మల్ని క్షమించు.. ఇలా దౌర్భాగ్యంగా సొమ్ముల కోసం ఎగబడుతున్న వారిని క్షమించవద్దంటూ ఇళ్ళల్లో వెంకన్న ఎదుట దీపాలు పెట్టారు. ఇంతటి ఘోరం ఎక్కడా చూడలేమని, కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిం చిందేకాక ఇప్పుడు ఇంకా బొంకుతున్నారని.. జరిగిందేమిటో, చేసిన వారెవరో శిక్షించాల్సింది మరెవరినో వెంకన్న స్వయంగా త్వరలోనే నిర్ధారిస్తారంటూ ఒకింత కటువుగా మాట్లాడుతున్న వారూ లేకపోలేదు. ‘తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొ ఆవేశపూరిత భావోద్వేగం. లడ్డూ తయారీలో కూడా కక్కుర్తిపడతారా. పోయేకాలం వచ్చినట్టుంది అందుకనే బరితెగింపు. ఎన్నడైనా చూశామా. వెంకన్నతో పెట్టుకుంటే ఏమైపోతారో. ఎందుకిలా ఒకరి ఇష్టాన్ని మరొకరు దెబ్బతీయాలనుకుంటున్నారా. పైపైకి నంగనాచి కబుర్లు, లోలోన నికృష్ట చర్యలు. వెంకన్ననే నమ్ముకుని నిత్యం ఆరాధించే కోట్లాది మంది భక్తుల మనో భావాలను పూర్తిగా దెబ్బతీశారు..’ మహాలక్ష్మి అనే గృహిణి ఆవేదన ఇది. వివిధ పార్టీలకు చెందిన వారు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో జరిగిందని ఘోర అపచారమని వీరంతా పూర్తిగా నమ్ముతున్నారు. దీనికంతటికి జగన్‌ సారథ్యం వహిస్తున్న వైసీపీయే కారణమంటూ ఆగ్రహంతో ఊగిపోతున్న వారి సంఖ్య శుక్రవారం నాటికి మరింత పెరిగింది.

నడిరోడ్డు మీద ఉరి తీయాలి

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. లక్షలాది మంది భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారు. తాము ఇష్టదైవంగా కొలిచే తిరుమల వెంకన్నకు పదేపదే అపచారం చేసేలా ఐదేళ్ల పాటు వైసీపీ వ్యవహరిస్తూనే వచ్చింది. అడుగడుగునా భక్తులు ఇబ్బందులు పడేలా, కనీసం దర్శనం చేసుకునే అవకాశం కల్పించకపోగా ఆటంకాలు సృష్టించే ప్రయత్నం కొనసాగింది. భక్తుల పట్ల, వారి సౌకర్యాల పట్ల చూసీచూడనట్టుగా వదిలేశారు. ఏకంగా తిరుపతి లడ్డూ విషయంలో అపచారం చేశారు. దీనికి కారణమైన దోషులను గుర్తించాల్సిందే. కేసుల విచారణ పేరిట కాలయాపన చేయకుండా నడి రోడ్డుపై ఉరి తీయాల్సిందే.

– గన్ని వీరాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు

దేవుడు క్షమించడు..

హిందువులు ఇష్టపడే వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. ఆ దేవుడు కూడా వైసీపీని, మాజీ సీఎం జగన్‌ను క్షమించబోడు. హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే ధైర్యం చేసి కోరి మీదకు తెచ్చుకున్నారు. హిందువుల శాపం తగలక మానదు. దోషులెవరో విచారణలో తేల్చాల్సిందే. అందరి మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులు ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా శిక్షించాల్సిందే. ఇది ప్రతీ శ్రీవారి భక్తుల్లో ఉన్న మనసులోని మాట. బీజేపీ కూడా శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడి ఘోర తప్పిదం చేసిన వారిని, వారి వెనుక ఉన్న వారిని బహిరంగంగా శిక్షించాలని కోరుకుంటోంది.

– కె.కృష్ణప్రసాద్‌, ఏలూరు పార్లమెంటు బీజేపీ కన్వీనర్‌

కమీషన్ల కక్కుర్తితోనే ఇలా..

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రంపై విశ్వహిందూ పరిషత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఆవు నెయ్యికి బదులు, వివిధ జంతువుల కొవ్వుకలిపిన నెయ్యిని వాడడంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కేవలం కమీషన్ల కోసం కుక్కుర్తి పడిఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. దేవదాయ, ధర్మదాయ శాఖ వల్ల హిందూ ఆలయాలకు రక్షణ లేదు. కాబట్టి శాఖను రద్దు చేసి హిందూ ధార్మిక మండలికి అప్పగించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదించిన ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ అనేది నెలకొల్పాలనే ప్రతిపాదనను వీహెచ్‌పీ సమర్ధిస్తోంది. లడ్డూ అపవిత్రంపై వీహెచ్‌పీ న్యాయపరంగా పోరాటానికి సిద్ధమవుతోంది.

–వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - Sep 21 , 2024 | 12:27 AM