ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తుఫాన్‌ టెన్షన్‌

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:01 AM

బంగా ళాఖాతంలో అల్పపీడల ద్రోణి రైతులను పరుగులు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతలు కోసి అమ్మకానికి పంపే సమయంలో వర్షాలు కురుస్తుండడం తో హడలిపోతున్నారు.

బరకంతో కప్పిన ధాన్యం రాశి

అల్పపీడనం.. రైతుల్లో భయం

మాసూళ్ల వేళ.. భారీ వర్షాలు

కోతకొచ్చే సమయంలో తిప్పలు

ధాన్యాన్ని ఒబ్బిడి చేసే పనుల్లో అన్నదాతల పరుగులు

తాడేపల్లిగూడెం రూరల్‌/పెంటపాడు/ ఆచంట, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): బంగా ళాఖాతంలో అల్పపీడల ద్రోణి రైతులను పరుగులు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతలు కోసి అమ్మకానికి పంపే సమయంలో వర్షాలు కురుస్తుండడం తో హడలిపోతున్నారు. కోసిన ధాన్యం చాలా వరకు కళ్లాలపైనే ఉంది. ఎప్పుడు ఏం జరు గుతుందోనని రైతులు కలవరపడుతున్నారు.

ఏటా శాపంగా మారింది

‘ఏటా సార్వా సాగులో మాకు ఇది శాపం గా మారింది. ఎకరానికి రూ.30 వేల వరకూ పెట్టుబడులు పెట్టాం. ధాన్యం కోసినందుకు మిషన్‌కు గంటకు రూ.మూడు వేలు చెల్లిస్తున్నాం. సాధారణంగా సార్వాలో దిగు బడి తక్కువ. అయినా ఖర్చులు భరించి సాగు చేస్తుంటే, ప్రకృతి మాపై ఏటా తన ప్రతాపాన్ని చూపుతోంది. ధాన్యం ఆరబెట్టు కునేందుకు కనీసం సరైన కళ్లాలు లేవు. రోడ్ల పక్కన ఆరబెట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే తుఫాను ప్రభావంతో భయపడుతుంటే.. ధాన్యాన్ని దళారులు అయినకాడికి అడుగుతు న్నారు. మొత్తం పోతే ఇబ్బంది పడతాం. అందుకే కొంచెం నష్టమైనా తప్పని పరిస్థితు ల్లో ధాన్యం బయట వ్యక్తులకు అమ్ముకోవాల్సి వస్తోంది’ అంటూ రైతులు వాపోతున్నారు. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం, వీరంపాలెం, ఆరుగొలను, నవాబుపాలెం, జగన్నాధపురం, తదితర గ్రామాల్లో వరి ధాన్యం రోడ్లపైనే ఉండటంతో ఏం చేయాలో తోచని స్థితిలో మిగిలిపోయారు. కొందరు అవకాశం ఉన్న మేరకు ధాన్యం తూసేయగా మరికొంత ధాన్యం రోడ్లపైనే గుట్టలుగా ఉంచారు. పెంటపాడు మండలంలో చిన్న పాటి వర్షానికి రైతులు బరకాలు తీసుకుని కళ్లాలవైపు పరుగులు తీశారు. వర్షం పెద్దది కాకుండా ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకు న్నారు. కాని, ఆరబోసిన ధాన్యంపై బరకాలు కప్పుకునేలోగా ధాన్యం తడిచిపోయింది. వర్షం వెలిసిన తర్వాత మళ్లీ ధాన్యం ఎండబెట్టుకు న్నారు. ఆచంట మండలంలో సార్వా మాసూ ళ్లు మొదలయ్యాయి. అల్పపీడనంతో వర్షం పడుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. మరో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో మాసూళ్లు జరిగే అవకాశం ఉంది. ఇవి పూర్త య్యే వరకు వాతావరణం అనుకూలిస్తేనే సార్వా నుంచి గట్టెక్కుతాం అని రైతులు అం టున్నారు. ఆచంటలో మంగళవారం ఉదయం నుంచి మబ్బులు, మేఘాలతో వాతావరణం నిండి ఉంది. గంటపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు, ప్రధాన రహదారులు నీట మునిగాయి. వాహనదారులు పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు.

Updated Date - Nov 13 , 2024 | 12:04 AM