ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీచర్లకు బోధనేతర పనులు వద్దు

ABN, Publish Date - Nov 04 , 2024 | 12:17 AM

బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించడానికి ప్రభుత్వాలు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు.

యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు

ఏలూరు అర్బన్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించడానికి ప్రభుత్వాలు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. యూటీఎఫ్‌ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంఘ స్వర్ణోత్సవ మహాసభలు ఆదివారం ఏలూరులో ప్రారంభమయ్యాయి. అన్ని మండలాల నుంచి ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ పదో తరగతి సోషల్‌ స్టడీస్‌ పాఠ్యాంశాలు ఉపాధ్యాయులకే అర్థంకానంతగా జఠిలంగా ఉన్నాయని, భారీ సిలబస్‌ను తగ్గించా లని పలుమార్లు విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదని విమర్శించారు. జాతీయ, అంతర్జాతీయస్థాయి బోధన అంటూ వివిధరకాల కరికులం ప్రవేశ పెడుతూ ఏటా పదుల సంఖ్యలో టీచర్లకు శిక్షణ ఇవ్వడం, తదు పరి ఏడాది అవి పనికిరావంటూ కొత్తగా శిక్షణ ఇవ్వడం మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి అని ఆరోపించారు. త్వరలో జరుగనున్న ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి గోపిమూర్తిని గెలిపిం చడానికి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయా లని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూడా పీడీఎఫ్‌ తరఫున అభ్యర్థిని ఖరారుచేయను న్నామని, ఆ స్థానాన్నికూడా కైవసం చేసుకు నేందుకు శ్రమించాలని సూచించారు.

జీవో 117 రద్దు ఫలితం ఎక్కడ?

ప్రభుత్వ పాఠశాలల మనుగడను ధ్వంసం చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 117 ఉత్తర్వులతో వేలాది పాఠశాలలు మూతప డగా, లక్షలసంఖ్యలో బాలబాలికలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని యూటీఎఫ్‌ జిల్లా ప్రదానకార్యదర్శి ఆర్‌.రవికుమార్‌ ఆరోపించారు. ఈ జీవో రద్దుచేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించి నెలలు గడుస్తున్నా ప్రాథమిక తరగ తులను తిరిగి మాతృ పాఠశాలలకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. జీవో 117 ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయిందన్నారు. ప్రభుత్వ పాఠశా లల్లో తెలుగు, ఆంగ్ల మాథ్యమాలు రెండింటినీ సమాంతరంగా ప్రారంభించి ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ఎన్జీవోల సంఘం ఉమ్మడి జిల్లా చైర్మన్‌ సీహెచ్‌. శ్రీనివాస్‌ మాట్లాడుతూ టీచర్లు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభల్లో సోమవా రం జిల్లా నూతన కమిటీ ఎన్నుకుంటారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి బి.గోపిమూర్తి, రాష్ట్ర, జిల్లా నాయ కులు సుభాషిణి, షేక్‌ముస్తఫా అలీ, కుసుమకు మారి, శ్యాంబాబు, కనకదుర్గ, రాంబాబు, రంగ మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 12:17 AM