ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొనలేం.. తినలేం..

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:32 AM

మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆదివారం కూడా గతవారం మాదిరిగానే ఉన్నాయి. వారానికి సరపడ కూరగాయలతో సంచి నిండాలంటే రూ.300 నుంచి 500 వరకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

పెంటపాడు/పాలకొల్లు అర్బన్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆదివారం కూడా గతవారం మాదిరిగానే ఉన్నాయి. వారానికి సరపడ కూరగాయలతో సంచి నిండాలంటే రూ.300 నుంచి 500 వరకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. టమాటా, దొండకాయలు మినహాయించి ప్రతి కూరగాయ ధర గత వారం ధరే పలికింది. గత వారం రూ.80 అమ్మకం జరిగిన టమాటా ఈ వారం రూ.60లకు దిగింది. ఉల్లిపాయలు మాత్రం పాతవి రూ.60, కొత్తవి రూ.35 ధరతో కొనసాగాయి. ధరలు తగ్గుముఖం పట్టకపోవ డంతో వినియోదారులు ఇబ్బందిగానే కూరగాయలు కొనుగోలు చేశారు. ఇలా అయితే కొనలేం తినలేం అంటూ అవేదన వ్యక్తం చేశారు. తెల్లవంకాయిలు రూ. 50, నల్లవంకాయిలు రూ.50, బెండకాయలు రూ.40, దొండకాయలు రూ.35– 40, క్యారెట్‌ రూ.60, బీరకాయ రూ.60, పచ్చిమిర్చి రూ.40, బంగాళాదుంపలు రూ.40, ములక్కాయలు కాయ రూ.10, చిక్కుడు కాయలు రూ. 80, అరటికాయలు 3 రూ.20, బిన్నిస్‌ రూ.100, క్యాప్సికం రూ 100–120, అల్లం రూ.80 ధరలు పలికాయి.

పాలకొల్లులో వంకాయలు కిలో రూ.80, బీర కాయలు కిలో రూ85, దోస కాయలు రూ.60, దొండ, బెండ కిలో రూ.45, బంగాళా దుంపలు రూ.60, ఉల్లిపాయలు రూ.45నుంచి 50, పచ్చిమిర్చి రూ.60, టమాటా రూ.65 నుంచి 70, అరటి కా యలు జత రూ.20, అల్లం పావు కిలో రూ.60 పలికింది.

Updated Date - Oct 21 , 2024 | 12:32 AM