ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: ద్వారకా తిరుమలలో అధికారుల అలసత్వం.. స్వామి ఆదాయానికి గండి

ABN, Publish Date - Feb 01 , 2024 | 10:44 AM

Andhrapradesh: ద్వారకా తిరుమల చిన వెంకన్న స్వామి ఆలయంలో అధికారుల అలసత్వం కారణంగా స్వామివారి ఆదాయానికి గండి పడే ప్రమాదం ఏర్పడింది.

ఏలూరు, ఫిబ్రవరి 1: ద్వారకా తిరుమల చిన వెంకన్న స్వామి ఆలయంలో అధికారుల అలసత్వం కారణంగా స్వామివారి ఆదాయానికి గండి పడే ప్రమాదం ఏర్పడింది. దేవస్థానం టోల్‌గేట్‌‌లలో కాంట్రాక్టర్ టికెట్ డబ్బులు వసూలు చేయకపోవడంతో కొండపైకి వాహనాలు ఉచితంగానే వెళ్తున్న పరిస్థితి. తమకు నష్టం వచ్చిందని.. డిపాజిట్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ దేవస్థానం అధికారులను కాంట్రాక్టర్ కోరుతున్నారు.

ఇదీ సమస్య...

కాగా.. టోల్‌గేట్ వద్ద వాహనాలకు టికెట్ డబ్బులు వసూలు చేసేందుకు గాను రెండు సంవత్సరాలకు కాంట్రాక్టర్ టెండర్ వేశారు. గత రాత్రితో ఒక సంవత్సరం కాంట్రాక్ట్ గడువు ముగిసింది. అయితే మొదటి సంవత్సరం నష్టం వచ్చిందని కాంట్రాక్టర్ వాపోయారు. ఇకపై రెండవ సంవత్సరం కొనసాగించలేనంటూ దేవస్థానం ఈవోకు కాంట్రాక్టర్ లేఖ రాశారు. తన డిపాజిట్ డబ్బులు రూ.10 లక్షలు తిరిగి ఇవ్వాలని కాంట్రాక్టర్ కోరుతున్నారు. కాంట్రాక్టర్ నిర్ణయంతో టోల్‌గేట్ వద్ద టికెట్ కౌంటర్లలో సిబ్బంది లేకపోవడంతో స్వామివారి దర్శనానికి వచ్చే వాహనాలు కొండపైకి ఉచితంగా వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఆలయ అధికారుల అలసత్వం కారణానికి స్వామివారిని ఆదాయానికి నష్టం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాంట్రాక్టర్ లేఖకు సంబంధించి ఈవో స్పందన ఏంటో చూడాలి.

Updated Date - Feb 01 , 2024 | 04:04 PM

Advertising
Advertising