సమన్వయంతో సాగుదాం
ABN, Publish Date - Nov 03 , 2024 | 12:59 AM
‘ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు, సమన్వయంతో సమష్టిగా ముందుకు సాగుదాం. సమస్యలు వుంటే వాటిని పరిష్కరించుకుందాం’ అని విద్యుత్ శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూటమి నాయకులకు సూచించారు.
ఎమ్మెల్సీ, సాగునీటి, సహకార సంఘాల ఎన్నికల్లో సత్తా చాటుదాం
అందరూ కలిసి సమస్యలను పరిష్కరించుకుందాం
ఎన్డీయే కూటమి జిల్లా తొలి ఆత్మీయ సమావేశంలో మంత్రుల స్పష్టీకరణ
పలు సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల ముఖ్య నాయకులు
భీమవరం రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):‘ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు, సమన్వయంతో సమష్టిగా ముందుకు సాగుదాం. సమస్యలు వుంటే వాటిని పరిష్కరించుకుందాం’ అని విద్యుత్ శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూటమి నాయకులకు సూచించారు. భీమవరంలో శనివారం ఎన్డీయే కూటమి జిల్లా ఆత్మీయ సదస్సు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని నమ్మి 164 సీట్లు వచ్చాయని వాటిని ప్రజల నమ్మకంతో ఇచ్చారన్నారు. అదే తరహాలో తొందరలో రాబోతున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఫలితాలు రావాలని సూ చించారు. నీటి సంఘాలు, సహకార సంఘాల ఎన్నికలలో కూటమి సత్తా చాటాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు వేల పింఛన్‌ను నాలుగు వేలు చేసిం దని, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. పథకాలను ఇలా సమర్ధవంతంగా తీసుకు వెళుతున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా సాగులో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు రూ.15 లక్షలు తీసుకున్నారు. దీనిపై అధికారులతో చర్చించి ఏ విధం గా అందించాలన్న దానిపై అంచనాకు వస్తామన్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ విడిగా పోటీ చేయడంతో రాష్ట్రం సైకో చేతికి వెళ్లిందన్నారు. పార్టీ నాయకులు సమన్వయం తో ముందుకు వెళితేనే అభివృద్ధి సాధ్యపడు తుందని చెప్పారు. ఆకివీడు నుంచి పాలకొల్లు రాష్ట్ర హైవే రహదారి అభివృద్ధి ప్రణాళిక ముందుకు తీసుకెళ్తామన్నారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కూటమి 93 స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించిందని, ఎమ్మెల్సీ, నీటి సంఘాలు, కో ఆపరేటివ్ బ్యాంకుల ఎన్నికలలోను ఇదే స్ట్రైక్ రేట్‌తో ముందుకు సాగాలన్నారు.
ఆక్వా విద్యుత్ రూ.2కే ఇవ్వాలి
భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భీమవరం అభివృద్ధికి ఆక్వా రంగమే కారమని, ఆక్వా సాగుకు యూనిట్‌కు రెండు రూపాయలకే అందిం చేలా ఏర్పాటు చేయాలన్నారు. వీరవాసరం మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, అక్కడ ఐదెకరాల పొలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో మెట్ట ప్రాంతం ఎక్కువ. అక్కడ ఉపాధి హామీ నిధులు రూ.17 కోట్లు వస్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల కు ఆరు కోట్లే వచ్చాయి. అక్కడ రోడ్లు త్వరగా పాడవ్వవు. ఇక్కడ ఎక్కువగా దెబ్బ తింటాయి. కాబట్టి జిల్లాల ప్రాతిపాదికన నిధులు కేటాయించాలి.
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేసిన రంగాలను కూటమి ప్రభు త్వం పునఃనిర్మిస్తోంది. ఉపాధి నిధులు తక్కువ వచ్చినందుకు జిల్లాకు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేలా సీఎం దృష్టికి తీసుకెళ్లాలి.
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో రాష్ట్రంలో ఒక రూల్ పెట్టాలని కోరారు. ఇసుక రూ.23 వేలకు కొంటున్నారరని, ఈ సమస్య పరిష్కారానికి దీనిపై దృష్టి పెట్టాలన్నారు.
నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలి. సముద్ర తీరంలోని పేరుపాలెం బీచ్‌ను పర్యాటకంగా తీర్చిది ద్దాలి. నరసాపురం వశిష్ట వారధి పనులు వేగవంతం చేయాలి. ఇందుకు ముగ్గురు మంత్రులు చొరవ తీసుకోవాలి.
కష్టపడిన వారికి ఫలితం
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ సమష్టి కృషి వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది. పార్టీల్లో కష్టపడిన వారికి ఫలితం ఉంటుందన్నారు.
ఉమ్మడి జిల్లాల జనసేన అధ్యక్షుడు కొటికలపూడి చినబాబు మాట్లాడుతూ భీమవరంలో విద్యుత్ సమస్య తీర్చేందు కు ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ అందరం సమన్వయంతో ముందుకు సాగాలని, చిన్న, చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుందామని చెప్పారు.
బీజేపీ సీనియర్ నాయకుడు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ఇసుక, మద్యంలో పెద్దగా తేడా కనిపించడం లేదని, కిందస్థాయి నుంచి ఇసుకపై ప్రజలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి పెట్టాలన్నారు.
జనసేన నాయకుడు కనకరాజు సూరి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే వున్న చోట నామినేటెడ్ పదవులు 60 శాతం ఆ పార్టీకి, 30 శాతం జనసేనకు, పది శాతం బీజేపీకి, జనసేన ఎమ్మెల్యే వున్న చోట 60 శాతం ఈ పార్టీకి, 30 శాతం టీడీపీకి, 10 శాతం బీజేపీకి కేటాయించాలన్నారు.
టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పద్మనాభం మాట్లాడుతూ గత ప్రభుత్వం భూముల రీ సర్వేలో ఎన్నో తప్పులు చేసిందని, దీనిపై రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టి పెట్టాలని కోరారు.
మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సమష్టిగా ముందుకు సాగాలన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారికి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందన్నారు. సమావేశంలో ఆచం ట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పలువురు నేతలు హాజరయ్యారు.
Updated Date - Nov 03 , 2024 | 12:59 AM