ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చదువుల పండుగకు.. స్వాగతం

ABN, Publish Date - Dec 06 , 2024 | 12:45 AM

మునుపెన్నడూ జరగని విధంగా, వినూత్నంగా, విభిన్నంగా పండుగ వాతావరణంలో నిర్వహించనున్నాం. జిల్లాలోని 1,430 ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే ఈ వేడుకకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, దాతలు పాల్గొంటారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను, నాయకత్వ లక్షణాలను పెంచేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయి.

ఈ నెల ఏడో తేదీన పేరెంట్‌ టీచర్‌ మెగా మీట్‌..

మునుపెన్నడూ జరగని విధంగా, వినూత్నంగా, విభిన్నంగా పండుగ వాతావరణంలో నిర్వహించనున్నాం. జిల్లాలోని 1,430 ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే ఈ వేడుకకు

విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, దాతలు పాల్గొంటారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను, నాయకత్వ లక్షణాలను పెంచేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయి.

– జిల్లా కలెక్టర్‌ నాగరాణి

రేపు మెగా పేరెంట్స్‌ మీట్‌

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం.. 1,430 స్కూళ్లలో నిర్వహణ

విద్యార్థి పురోగతిపై తల్లిదండ్రులకు అవగాహన.. 13 రకాల కమిటీలతో నిర్వహణ

నిడమర్రు/భీమవరం ఎడ్యుకేషన్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): విద్యా వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7న రాష్ట్రస్థాయిలో తొలిసారిగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా తల్లిదండ్రుల సమావేశం నిర్వహించనుంది. విద్యార్థుల ప్రయోజనాల కోసం.. తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుంచి తల్లిదండ్రులు ఎలాంటి సహకారం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ఈ సమావేశం మంచి వేదిక. ఆ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని 1,430, ఏలూరు జిల్లాలో 1,788 ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ మీట్‌ జరుగుతుంది.

నిర్వహణ ఇలా..

పేరెంట్స్‌ మీట్‌ నిర్వహణను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సమావేశం సక్రమ నిర్వహణకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలసి 13 రకాల కమిటీలు ఏర్పాటుచేశారు. ఆహ్వాన కమిటీ, బడ్జెట్‌, కొనుగోలు కమిటీ, పాఠశాల పరిశుభ్రతా కమిటీ, పర్యావరణ భద్రతా కమిటీ, స్వాగత కమిటీ, సిట్టింగ్‌ కమిటీ, ప్రగతి నివేదికల కమిటీ, స్టేజ్‌ కమిటీ, సాంస్కృతిక కమిటీ, ఫుడ్‌ కమిటీ, హెల్త్‌ కమిటీ, ప్రెస్‌ కమిటీ మొదలైనవి. విద్యార్థులతో ఆహ్వాన పత్రికలు తయారు చేయించారు. ఈ పత్రికలతోనే వారి తల్లిదండ్రులను కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు.

పేరెంట్స్‌కు పోటీలు

తల్లిదండ్రులతో సమావేశం తూతూమంత్రంగా కాకుండా ప్రత్యేక ప్రణాళికతో నిర్వహించనున్నారు. పాఠశాలకు వచ్చిన తల్లులకు ముగ్గుల పోటీలు, తండ్రులకు టగ్‌ ఆఫ్‌ వార్‌ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు.

సమావేశానికి హాజరైన వారిలో ఉత్సాహంగా ఉన్న తల్లులను ప్రోత్సహించి మదర్‌ యాంకరింగ్‌ చేయించనున్నారు.

అత్యధికంగా జరుగుతున్న సైబర్‌ క్రైం నేరాలపై మహిళా పోలీసుల సహకారంతో అవగాహన ఆయా పాఠశాలల్లో చదివి ఉన్నతస్థానంలో ఉన్న పూర్వ విద్యార్థులను పాఠశాలకు ఆహ్వానించి వారి ప్రసంగాల ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తినింపేలా అజెండాలో చేర్చారు.

హోలిస్టిక్‌ ప్రోగ్రస్‌ కార్డుల ద్వారా విద్యార్థి భావవ్యక్తీకరణ, సహకారం, నాయకత్వం, తార్కిక ఆలోచన, పర్యావరణం, కళలు, క్రీడా నైపుణ్యాలను పరిశీలించి విద్యా ప్రగతితోపాటు నమోదు చేసి తల్లిదండ్రులకు అందిస్తారు.

పాఠశాల నిర్వహణ, విద్యార్థుల ప్రగతి, మధ్యాహ్న భోజన నిర్వహణ మొదలైన అంశాల్లో తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరిస్తారు.

పాఠశాలలకు హాజరయ్యే తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా దాతల సహకారంతో శుభదిన్‌ భోజన్‌ ఏర్పాట్లు చేయనున్నారు.

Updated Date - Dec 06 , 2024 | 12:45 AM