వైసీపీ జడ్పీటీసీల నిరసనలతో హోరెత్తిన జడ్పీ
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:28 AM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సమావేశం ఎన్నికల కోడ్ కారణంగా రద్దయింది. అయితే ఆ విషయం తమకు తెలియ దంటూ సోమవారం వైసీపీ జడ్పీటీసీలు ఏలూరు లోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో వైసీపీ జడ్పీటీసీ ల నిరసనలతో జిల్లా పరిషత్ హోరెత్తింది.
సమావేశం రద్దయిన విషయం తమకు తెలియదన్న ప్రజాప్రతినిధులు
మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారని జడ్పీ సీఈవోను చుటుముట్టి నిలదీత
జడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ.. ప్రత్యేక సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి
ఎన్నికల కోడ్ అనంతరం సమాచారం ఇచ్చి సమావేశం నిర్వహిస్తాం.. కలెక్టర్
నిరసన విరమించిన వైసీపీ జడ్పీటీసీ సభ్యులు
ఏలూరు సిటీ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సమావేశం ఎన్నికల కోడ్ కారణంగా రద్దయింది. అయితే ఆ విషయం తమకు తెలియ దంటూ సోమవారం వైసీపీ జడ్పీటీసీలు ఏలూరు లోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో వైసీపీ జడ్పీటీసీ ల నిరసనలతో జిల్లా పరిషత్ హోరెత్తింది. ఈ నెల 8న స్టాండింగ్ కమిటీల సమావేశం నిర్వహి ంచి, ఇప్పుడు ప్రత్యేక సమావేశానికి ఎన్నికల కోడ్ ఏమిటని పలువురు జడ్పీటీసీలు ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా ఇటు వంటి సమావేశాలు నిర్వహించవద్ద కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశాన్ని రద్దు చేశామని, ఈ విషయాన్ని జడ్పీటీసీలకు సోమవారం రాత్రి తెలిపామని జడ్పీ సీఈవో కేఎస్‌ఎస్ సుబ్బారావు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎప్పుడు ఈ ప్రత్యేక సమా వేశం నిర్వహించేది రాత పూరకంగా తేదీ చెప్పా లని కోరారు. సమావేశ తేదీ చెప్పలేమని అన్నా రు. దీంతో జడ్పీ సీఈవో సమాధానాలు రుచించ కపోవ టంతో వైసీపీ జడ్పీటీసీలు జడ్పీ చైర్ పర్సన్‌కు వ్యతిరేకరంగా నినాదాలు చేసుకుంటూ కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి మీ కోసం కార్యక్రమంలో ఉన్న కలెక్టర్ కె.వెట్రిసెల్విని కలిశారు. ఎన్నికల కోడ్ అనంతరం జిల్లా పరిషత్ ప్రత్యేక సమావే శం నిర్వహించాలని, సమావేశ సమయం ఉద యం 9 గంటలకు కాకుండా 11 గంటలకు నిర్వహించాలని వారు కోరారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడంతో జడ్పీటీసీల నిరసన కార్యక్రమం ముగిసింది. ఈ నిరసన కార్యక్రమంలో 35 మంది జడ్పీటీసీల వరకు పాల్గొన్నారని చెబుతున్నారు.
తెలియదనడం సరికాదు
జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్
ఎన్నికల కోడ్‌తో ప్రత్యేక సమావేశం రద్దయి ందని, ఈ సమాచారాన్ని జడ్పీటీసీ సభ్యుల గ్రూప్‌లో పెట్టామని, అయినా తమకు తెలియ దని వారు చెబుతుండడం సరికాదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అన్నారు. జడ్పీ క్యాంప్ కార్యాలయం వద్ద సోమవారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జడ్పీటీసీలు అందరూ ప్రజా సేవ చేస్తారనే ఉద్ధేశ్యంతో ప్రజలు గెలిపించారని , వారికి ప్రజా సేవ చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇంకా రెండేళ్లు ప్రజలకు సేవ చేసుకునే అవకా శం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో తనకు జడ్పీ చైర్ పర్సన్‌గా బి ఫారం ఇచ్చినప్పు డు కూడా అడ్డుకున్నారన్నారు. ఒక బీసీ మహి ళగా తనకు అవకాశం రాకుండా చూశారని, ఇప్పుడు వారే జడ్పీటీసీలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. జడ్పీటీసీలు అందరూ.తనకు సహకారించాలని ఆమె కోరారు. వీరవాసరం జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు, ఆచంట జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు పాల్గొన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 12:28 AM