ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జడ్పీలో జగడమేనా?

ABN, Publish Date - Oct 21 , 2024 | 11:52 PM

ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్‌లో రోజురోజుకు రంగులు మారుతున్నాయి. ఇంతకుముందు వైసీపీ పక్షానికి చెందిన ఘంటా పద్మశ్రీ జడ్పీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఆమె ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి తన భర్తతో సహా టీడీపీలో చేరారు. దీంతో జిల్లా పరిషత్‌లో అత్యధిక బలం కలిగిన వైసీపీ కాస్తా ఖంగుతింది. కాని తమకున్న బలంతో ఎట్టి పరిస్థితుల్లోను కొన్ని తీర్మానాలను అడ్డుకోవాలని, ఇంకొన్నింటిని ముందుకు సాగకుండా చూడాలని, తద్వారా తమ పార్టీ ఉనికిని జడ్పీలో కాపాడుకునేందుకు వైసీపీ తరచూ ఎత్తుగడలు వేస్తూనే ఉంది. ఇప్పటికే జిల్లా పరిషత్‌కు సంబంధించి అత్యవసర సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా వైసీపీ అనుకూల జడ్పీటీసీలందరూ గట్టిగా పట్టుపడుతున్నారు. పక్షం రోజులకు ముందే ఒకసారి అత్యవసర సమావేశానికి పట్టుపట్టారు. తిరిగి మరోసారి వైసీపీ అనుకూల జడ్పీటీసీలంతా సోమవారం జిల్లా పరిషత్‌ అతిథి గృహంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఏలూరు జడ్పీ అతిథి గృహం వద్ద వైసీపీ జడ్పీటీసీలు

మళ్ళీ అత్యవసర సమావేశానికి పట్టుపట్టిన వైసీపీ

ఏలూరులో సమావేశమైన 30 మంది జడ్పీటీసీలు

నెలలో ఇది రెండోసారి డిమాండ్‌

అత్యవసరమా.. అదిలింపా

వెనకుండి నడిపిస్తున్న నేతలెవరు ?

చైర్‌పర్సన్‌ పద్మశ్రీ అనుకూలురుల్లో మాత్రం ధీమా

ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్‌లో రోజురోజుకు రంగులు మారుతున్నాయి. ఇంతకుముందు వైసీపీ పక్షానికి చెందిన ఘంటా పద్మశ్రీ జడ్పీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఆమె ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి తన భర్తతో సహా టీడీపీలో చేరారు. దీంతో జిల్లా పరిషత్‌లో అత్యధిక బలం కలిగిన వైసీపీ కాస్తా ఖంగుతింది. కాని తమకున్న బలంతో ఎట్టి పరిస్థితుల్లోను కొన్ని తీర్మానాలను అడ్డుకోవాలని, ఇంకొన్నింటిని ముందుకు సాగకుండా చూడాలని, తద్వారా తమ పార్టీ ఉనికిని జడ్పీలో కాపాడుకునేందుకు వైసీపీ తరచూ ఎత్తుగడలు వేస్తూనే ఉంది. ఇప్పటికే జిల్లా పరిషత్‌కు సంబంధించి అత్యవసర సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా వైసీపీ అనుకూల జడ్పీటీసీలందరూ గట్టిగా పట్టుపడుతున్నారు. పక్షం రోజులకు ముందే ఒకసారి అత్యవసర సమావేశానికి పట్టుపట్టారు. తిరిగి మరోసారి వైసీపీ అనుకూల జడ్పీటీసీలంతా సోమవారం జిల్లా పరిషత్‌ అతిథి గృహంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

(ఏలూరు– ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లా పరిషత్‌లో మొదటి నుంచి వైసీపీదే ఆధిపత్యం. జడ్పీలో మొత్తం జడ్పీటీసీల సంఖ్య 48 కాగా దీనిలో 46 వైసీపీ అనుకూలురుదే. వీరవాసరం, ఆచంట జడ్పీటీసీలు మాత్రం కూటమి పక్షంలో ఉన్నాయి. ఇంత అత్యధిక బలం కలిగిన జడ్పీలో అనూహ్యంగా చైర్‌పర్సన్‌ నేరుగా టీడీపీలో చేరా రు. ఆ తరువాత మరికొంతమంది జడ్పీటీసీలు టీడీపీలో చేరతారని అందరూ భావించారు. ఆ ప్రక్రియ మాత్రం ఇప్పటిదాకా పూర్తికాలేదు. దీనికి తోడు వైసీపీ పెద్దలు మాత్రం జడ్పీలో తమకున్న బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాగూ నాలుగేళ్ళు దాటనిదే చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి అవకాశం లేదన్న భావనతో ఏదొక రకంగా తమ పార్టీ ఉని కి ఉండేలా జాగ్రత్తపడడం ఆరంభించారు. జడ్పీ టీసీ సభ్యులను పార్టీని వీడకుండా ఇప్పటికే కొంతమంది పూర్తిగా అనునయించారు. ఎందుక నంటే చైర్‌పర్సన్‌ ఒక్కసారిగా పార్టీ మారడంతో జడ్పీలో అత్యధిక సభ్యులు కూడా ఇదే బాట పడ తారని అందరూ ఊహించారు. తీర ప్రాంతానికి చెందిన జడ్పీటీసీలు కొందరు నేరుగా జనసేన లోకైనా వెళ్తామే తప్ప టీడీపీ వైపు రాబోమన్న నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి తర్జనభర్జనలు జడ్పీటీసీ సభ్యుల మధ్య తరచూ చోటు చేసుకుం టున్నాయి. స్థానికంగా ఎమ్మెల్యేలంతా కూటమి పక్షానికి చెందిన వారు కావడం, తాము మాత్రం మండల స్థాయిలో జడ్పీటీసీ సభ్యులగా వైసీపీలో ఉండి ఏమాత్రం ప్రయోజనమని భావిస్తున్న మరికొందరు మాత్రం టీడీపీవైపు తొంగి చూడ డానికి ప్రయత్నిస్తూనే వచ్చారు. ఇప్పుడున్న పరి స్థితుల్లో తాము ఎదురుతిరిగి ఏమీ చేయలేమని, సర్దుకుపోవడమే తప్ప అనే భావనలో ఇంకొం దరు ఉన్నారు. ఇలా రకరకాలుగా ఎవరం తట వారుగా జడ్పీటిసిలు తమ మనోభావాలను పూర్తి గా బయట పెట్టలేక, అలాగని నేరుగా మౌనం దాల్చి ఉండలేక సతమతమవుతూనే ఉన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి మా త్రం టీడీపీ కైవసం అయినా జడ్పీటిసి సభ్యుల్లో మాత్రం ఇంకా ఊగిసలాట కొనసాగుతూనే ఉంది.

ఎందుకు అత్యవసర సమావేశం ?

జడ్పీలో అత్యవసర సమావేశం నిర్వహించాలని కొందరు జడ్పీటీసీలు గట్టిగా పట్టుపట్టడానికి వెనుక బలమైన కారణాలు ఉన్నాయా ? వైసీపీలో కొందరు పెద్దల ఆదేశం మేరకే ఈ రకంగా బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నా రా ? లేకుం టే జిల్లా పరిషత్‌ తమ ఆధీనంలో ఉందన్న సంకేతాలు బలం గా బయటకు వెళ్ళేలా కొత్త ఎత్తుగడ వేశారా అనే సందేహాలే ఇప్పుడు అందరిలోనూ ఉన్నాయి. వాస్తవానికి జిల్లా పరిషత్‌లో అభివృద్ధి, సంక్షేమా నికి సంబంధించి పెద్దగా నిధులు లేవు. జగన్‌ ప్రభుత్వ హయాంలో జడ్పీల కు ఎక్కడా ఆర్థిక ఊతమివ్వలేదు. ఆఖరుకి జనరల్‌ ఫండ్‌ విషయంలోను ఎప్పుడూ దోబూచులాటే. ఒకానొక దశలో జిల్లా పరిషత్‌లు తమ సభ్యులం దరికీ జనరల్‌ ఫండ్‌ కింద కొన్ని నిధులు కేటాయించి వారి ఆధ్వర్యంలోనే ఆయా మండలాల్లో పనులు సాగేలా చూడడం సమాంతరంగా జడ్పీటీసీ లకు కూడా స్థానికంగా ప్రతిష్ట ఉండేలా జాగ్రత్తపడిన సందర్భాలు ఉన్నా యి. కాని వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం ఇవేవీ అప్పటి ప్రభుత్వానికి పట్టలేదు. జిల్లా పరిషత్‌లు దాదాపు నీరసించాయి. కొత్త పనులు చేపట్టలేక ఏదో తూతూ మంత్రంగా వ్యవహారం నడిపేవి. ఇప్పుడు పంచాయతీరాజ్‌ విభాగంలో మంత్రి పవన్‌కళ్యాణ్‌ వినూత్న చర్యలకు దిగుతుండడం, ఆయా పనులకు దగ్గరుండి పర్యవేక్షణ, నిధుల కేటాయిస్తుండడంతో కొంతమేర నూతన ఉత్తేజం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జడ్పీలో అత్యవసర సమావేశం నిర్వహణకు వీలుగా వైసీపీ ఎజెండా ఏమిటనేదే అందరి ప్రశ్న. జడ్పీ అతిథి గృహంలో సోమవారం జడ్పీటీసీల సమావేశం నిర్వహణకు వైసీపీలో ఒక సీనియర్‌ నేత దగ్గరుండి నడిపించారని చెబుతున్నారు. ఇప్ప టికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకత్వం బలహీనపడినా ఇంకో వైపు జిల్లా పరిషత్‌ సభ్యులను మాత్రం నేరుగా డైరెక్ట్‌ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ఘంటా ప్రసాదరావు మాత్రం ఇప్పటికీ ధీమాతో ఉన్నారు. కేవలం అలజడి సృష్టించ డానికా, లేక తమకు కొత్త అవకాశాలు రావడానికా, జడ్పీటీసీల దూకుడనేది త్వరలో తేలబోతుందని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. అత్యవసర సమావే శాన్ని కోరుతూ దాదాపు 30 మంది జడ్పీటీసీలు సంతకాలు చేయడం మరొ క అంశంగా భావిస్తున్నారు. ఇప్పటిదాకా అత్యధికులు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలోకి వస్తారని అందరూ లెక్కకట్టారు. కాని తాజా పరిణామాల ప్రకారం వైసీపీ అనుకూల జడ్పీటిసిలు ఉమ్మడిగా ఒకవైపే ఉండబో తున్నా రా లేక అత్యవసర సమావేశమంటూ ఒక ఝలక్‌ ఇచ్చి తదుపరి నిర్ణయాల వైపు తొంగి చూస్తున్నారా అనేది కూడా చాలా మందిలో ఓ అభిప్రాయం ఉంది. అలా కాకుండా వైసీపీకి అనుకూలంగానే కడదాకా ఉండాలని వీరం తా భావిస్తే ఉమ్మడి పశ్చిమ జడ్పీలో మాత్రం భవిష్యత్తులో ఒకింత కుదుపే కాబోతుంది.

Updated Date - Oct 21 , 2024 | 11:52 PM