ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హానికరమని గుర్తిస్తే కొట్టేయడంలో తప్పేముంది?

ABN, Publish Date - Sep 05 , 2024 | 03:14 AM

కోనోకార్పస్‌ చెట్లు మనుషుల ఆరోగ్యానికి హాని తలపెడుతున్నాయని గుర్తించినప్పుడు, వాటిని కొట్టివేయడంలో తప్పేముంది? అని హైకోర్టు ప్రశ్నించింది. జమ్మూ కాశ్మీర్‌లో సైతం ఓ రకం చెట్ల నుంచి దూదిలాంటి పదార్థం విడుదలయ్యేదని, దానివల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొన్నారని పేర్కొంది.

కోనోకార్పస్‌ చెట్ల నరికివేతపై పిల్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం

అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): కోనోకార్పస్‌ చెట్లు మనుషుల ఆరోగ్యానికి హాని తలపెడుతున్నాయని గుర్తించినప్పుడు, వాటిని కొట్టివేయడంలో తప్పేముంది? అని హైకోర్టు ప్రశ్నించింది. జమ్మూ కాశ్మీర్‌లో సైతం ఓ రకం చెట్ల నుంచి దూదిలాంటి పదార్థం విడుదలయ్యేదని, దానివల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొన్నారని పేర్కొంది. ఇంటి నుండి బయటకు రావడానికి మాస్కు ధరించాల్సి వచ్చేదని గుర్తు చేసింది. కోనోకార్పస్‌ చెట్ల విషయంలో కూడా ఇలాంటి ఇబ్బంది ఉందని గుర్తించి వాటిని నరికివేయాలని నిర్ణయించి ఉంటారని పేర్కొంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెట్ల పెంపకం విషయంలో తమకు అమితమైన శ్రద్ధ ఉందని చెబుతున్న నేపథ్యంలో చెట్లను పెంచేందుకు ఇప్పటివరకు ఏమి చేశారు? ఎన్ని మొక్కలు నాటారు? తదితర వివరాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను ఆదేశించింది. విచారణను నవంబరు 6కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మానవాళి, పర్యావరణానికి హానికరమని శాస్త్రీయంగా నిరూపితమయ్యేవరకు కోనోకార్పస్‌ చెట్ల నరికివేతను నిలుపుదల చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ గుంటూరుకు చెందిన వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మరో ఇద్దరు ప్రొఫెసర్లు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ బుధవారం విచారణకు రాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజ స్పందిస్తూ... ‘కోనోకార్పస్‌ చెట్ల కారణంగా ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో కాకినాడ, నెల్లూరు జిల్లా కలెక్టర్లు మొత్తం 645 చెట్లను కొట్టివేశారు. వాటి స్థానంలో దేశీయ జాతి మొక్కలు నాటుతున్నారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తాం. అందుకు మరికొంత సమయం ఇవ్వాలి’ అని అభ్యర్థించారు. ఈ దశలో పిటిషనర్ల తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ స్పందిస్తూ... ‘ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా చెట్లను నరికి వేస్తున్నారు. చెట్లపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి’ అని కోరారు.

Updated Date - Sep 05 , 2024 | 08:07 AM

Advertising
Advertising