ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఉచిత ఇసుకలో సమస్యలెందుకు?

ABN, Publish Date - Aug 03 , 2024 | 03:05 AM

ఉచిత ఇసుక విధానంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని గనుల శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అధికారులు పాయింట్లను పరిశీలించాలి

గనుల శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ఉచిత ఇసుక విధానంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని గనుల శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రవాణా చార్జీల విషయంలో నెలకొన్న గందరగోళం, రీచ్‌ల వద్ద వాహనాల బారులు తీరడం, లైన్‌లో ఉన్నా తమకు ఇసుక ఇవ్వలేదంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో నిశితంగా పరిశీలించి పరిష్కారం చూపాలని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంకే మీనాను ఆదేశించారు. శుక్ర వారం గనులు, ఎక్సైజ్‌ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఆ రెండు విభాగాల ముఖ్యకార్యదర్శి మీనా భేటీలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీఎం ఆ ఇద్దరితో మాట్లాడినట్లు తెలిసింది. మీనా ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పెండ్యాల, కోనసీమ జిల్లా రావులపాలెం ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఆ సందర్భంగా అక్కడున్న వినియోగదారులు, ట్రక్కుల యజమానులతో మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. రీచ్‌లను పరిశీలించి ఏ సమస్యలు కనిపెట్టారని ఆరాతీసినట్లు తెలిసింది. ఆన్‌లైన్‌ పర్మిట్లు ఉన్నవారు, లేనివారు స్టాక్‌పాయింట్ల వద్దకు రావడంతో పోటీ విపరీతంగా పెరిగిపోయిందని, వాహనాల క్యూ ఊహించని రీతిలో ఉంటోందని మీనా నివేదించారు. కాగా, అధికారులు వీలైనంత మేరకు ఇసుక స్టాక్‌పాయింట్లకు వెళ్లి సమస్యలు తెలుసుకుని, చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Updated Date - Aug 03 , 2024 | 09:28 AM

Advertising
Advertising
<