ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diwali: ఈ ఊరు పేరే దీపావళి.. ఎక్కడో తెలుసా

ABN, Publish Date - Oct 28 , 2024 | 06:38 PM

దీపావళి... పండుగ అని తెలుసు. కానీ ఓ ఊరు పేరు దీపావళి అని తెలుసా. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దీపావళి అనే గ్రామం ఉంది. అసలు ఆ పేరెలా వచ్చింది. ఊరు ప్రత్యేకత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.

అమరావతి: దీపావళి... పండుగ అని తెలుసు. కానీ ఓ ఊరు పేరు దీపావళి అని తెలుసా. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దీపావళి అనే గ్రామం ఉంది. అసలు ఆ పేరెలా వచ్చింది. ఊరు ప్రత్యేకత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో దీపావళి అనే గ్రామం ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలు సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే శ్రీకాకుళం జిల్లా దీపావళి అనే గ్రామంలో దీపావళి పండుగను ఐదు రోజులు జరుపుకుంటారు. పండుగ రోజు పితృదేవతలకు పూజ చేసి, వారికి నైవేధ్యం సమర్పించిన తర్వాతనే దీపావళి పండుగ జరుపుకుంటామని ఆ గ్రామస్థులు చెబుతున్నారు.

ఆ ఊరికి దీపావళి అనే పేరు రావడం వెనక ఓ పురాణ గాథ ఉంది. పూర్వం శ్రీకాకుళాన్ని పాలించే ఒక రాజు ఈ గ్రామం మీదుగా శ్రీకూర్మనాథుడి దర్శనానికి వెళ్తుండేవారు. ఒకరోజు కూర్మనాథుడిని దర్శనం చేసుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో రాజు స్పృహ తప్పి పడిపోతాడు. ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న గ్రామ ప్రజలు రాజు స్పృహ తప్పి పడిపోవడాన్ని గమనించి అతని దగ్గరికి దీపాలు తీసుకుని వెళ్లి ఆ వెలుగులో రాజుకు సపర్యలు చేసి మంచినీరు, తినడానికి ఆహారం అందిస్తారు. రాజు స్పృహలోకి వచ్చి ఇది ఏ గ్రామం అని అడగ్గా తమ గ్రామానికి పేరులేదని గ్రామస్థులు చెబుతారు.


మీరంతా ఈ దీపాల వెలుతుర్లో నాకు సపర్యలు చేశారు కాబట్టి మీ ఊరికి దీపావళి అని పేరు పెడుతున్నా అని చెప్పి రాజు వెళ్లిపోతారు. అప్పటి నుంచి ఈ గ్రామాన్ని అందరూ దీపావళి అని పిలుస్తున్నారట.

ఏపీలో సంక్రాంతి పండుగ రోజు పితృదేవతలకు పూజా కార్యక్రమాలు జరుపుతారు. ఆ రోజే కొత్త బట్టలు ధరిస్తారు. కానీ.. దీపావళి గ్రామంలో దీపావళి పండుగ రోజున సొండి తెగకు చెందిన ప్రజలు పితృ కర్మలు జరిపిస్తారు. ఆ రోజున పెద్దలు వచ్చి తమను ఆశీర్వదిస్తారనే సొండి ప్రజలు నమ్ముతుంటారు. దీపావళికి కొత్త అల్లుడిని పిలిచి మర్యాదలు చేస్తుంటారు.

ఆచారాలు..

ఈ గ్రామంలో దీపావళి సమయంలో అనుసరించే ఆచారాలు అనేక భారతీయ పండుగలలో కనిపించే ఐక్యత స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. సంక్రాంతి సందర్భంగా పాటించే సంప్రదాయాల మాదిరిగానే గ్రామంలో ప్రత్యేక ఆచారాలు, విందులతో అల్లుడుకి ఘనంగా స్వాగతం పలుకుతారు. కుటుంబ సభ్యులంతా కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. సాయంత్రం కాగానే గ్రామం దీపాలతో ప్రకాశిస్తుంది. పండుగ రోజు రాత్రి జరిపే సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటాయి.

Fraud: పోలీసులు గుర్తు పట్టకుండా ప్లాస్టిక్ సర్జరీ.. చివరకు

Updated Date - Oct 28 , 2024 | 06:40 PM