ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నో మాక్‌.. నో అసెంబ్లీ!

ABN, Publish Date - Nov 17 , 2024 | 04:33 AM

ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోమని, అప్పటి వరకు అసెంబ్లీలో తాను మాట్లాడాల్సినదంతా ‘మాక్‌ అసెంబ్లీ’ ద్వారా ప్రజలకు చేరవేస్తానంటూ గంభీరంగా ప్రకటించిన వైసీసీ అధ్యక్షుడు జగన్‌ రెంటికీ చెడ్డ రేవడిలా మారారు.

జగన్‌ విచిత్ర రాజకీయం

శాసనసభలో సంఖ్యాబలం లేకున్నా ప్రతిపక్ష హోదాకు పట్టు

ఆ సాకుతో సమావేశాలకు డుమ్మా.. మాక్‌ అసెంబ్లీ అంటూ అదీ లేదు

మండలిలోనూ వైసీపీ పేలవ ప్రదర్శన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోమని, అప్పటి వరకు అసెంబ్లీలో తాను మాట్లాడాల్సినదంతా ‘మాక్‌ అసెంబ్లీ’ ద్వారా ప్రజలకు చేరవేస్తానంటూ గంభీరంగా ప్రకటించిన వైసీసీ అధ్యక్షుడు జగన్‌ రెంటికీ చెడ్డ రేవడిలా మారారు. అసెంబ్లీకి వెళ్లనందుకు రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మాక్‌ అసెంబ్లీ అని ఆ ఊసెత్తకపోవడంతో సొంత పార్టీ నేతలు, కార్యకర్తల్లోనూ చులకనయ్యారు. ఈ నెల 11వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి మాక్‌ అసెంబ్లీని చేపడతాన్న జగన్‌ ఆ ప్రయత్నం చేయలేదు. మరోవైపు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని వైసీపీ చేజార్చుకుంది. జగన్‌ నిర్ణయంతో ఆయన పార్టీ ఎమ్మెల్యేలూ అసెంబ్లీ సమావేశాలకు దూరం కావాల్సి వచ్చింది. మరోవైపు శాసనమండలిలోనూ ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో వైసీపీ విఫలమైంది. శాసనమండలిలో 58 సభ్యులకు గాను వైసీపీకి 37 మంది ఉన్నారు. టీడీపీ నుంచి తొమ్మిది మంది, జనసేన నుంచి ఒకరు, పీడీఎఫ్‌ నుంచి ఇద్దరు, నలుగురు స్వతంత్ర సభ్యులు ఉన్నారు. ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. శాసనమండలిలో మెజారిటీ ఉండటంతో వైసీపీ సభ్యులు సమావేశాలకు హాజరవుతున్నారు. శాసనసభకు రాకున్నా శాసనమండలిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైసీపీ ప్రకటించింది. కానీ ప్రజా సమస్యలకు బదులు సోషల్‌ సైకోలకు మద్దతుగా మాట్లాడి ఆ పార్టీ సభ్యులు విమర్శలు మూటగట్టుకున్నారు.


గన్‌, వైసీపీ నేతల వైఖరిని ఆయన సోదరి, పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కూడా ఎండగట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు చట్ట సభల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. 2019 నుంచి 2024 దాకా శాసనసభలో వైసీసీ సభ్యులు నోటికి అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడేశారు. నాటి అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా వారికి సహకరించారు. గత ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ప్రజాతీర్పును గౌరవించి ప్రతిపక్షంలో ఉండటానికి జగన్‌ అంగీకరించడం లేదు. సంఖ్యా బలం తగినంత లేకున్నా ప్రతిపక్ష నేత హోదా కోసం పట్టుబడుతున్నారని, అసెంబ్లీకి రాకుండా తప్పించుకునేందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు కనిపించక పోగా, మండలిలో మెజారిటీ ఉన్నా వైసీపీ ఎమ్మెల్సీల పాత్ర అంతంత మాత్రమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సోషల్‌ మీడియాలో వైసీపీ సైకో బ్యాచ్‌ ఆగడాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చెప్పడానికి వీలులేని భాషలో మహిళలపై పోస్టులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, చివరకు జగన్‌ తల్లి, చెల్లిపైనా వైసీపీ సోషల్‌ సైకో బ్యాచ్‌ నీచాతి నీచమైన పోస్టులు చేసింది. వీటిని ఖండించాల్సిన జగన్‌ వారికి మద్దతుగా మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

వైసీపీ సోషల్‌ మీడియాపై పోలీసుల చర్యలను నిరసిస్తూ శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఆ సమయంలో శాసనమండలిలోనే ఉన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆనాడు శాసనసభలో వైసీసీ ఎమ్మెల్యేలు తన తల్లిని అవమానించిన తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అసెంబ్లీ సమావేశాలలో జగన్‌ వ్యూహం ఏమిటో సొంత పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో కొందరు పార్టీ మారుతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మాక్‌ అసెంబ్లీని చేపడితే ఎంతమంది వస్తారో అనే సందేహాలు ఉన్నాయి. అందుకే జగన్‌ రెండుసార్లు మీడియా సమావేశాలతో సరిపుచ్చారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ సమావేశాలకు జగన్‌ సానుకూల మీడియాను పిలిపించుకున్నారు. ఎవరూ ప్రశ్నించరు కనుక ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు, విమర్శలు చేశారు.

Updated Date - Nov 17 , 2024 | 04:33 AM