ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళపై వైసీపీ వర్గీయుల దాడి

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:23 AM

స్థలం వివాదంలో ఓ మహిళపై వైసీపీ వర్గీయులు దాడి చేసి గాయపరచిన సంఘటన సోమవారం పత్తికొండ మండలం దూదేకొండ గ్రామంలో చోటుచేసుకొంది.

వైసీపీ వర్గీయుల దాడీలో గాయపడ్డ ఆదిలక్ష్మి

స్టేషనలో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ

పత్తికొండ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : స్థలం వివాదంలో ఓ మహిళపై వైసీపీ వర్గీయులు దాడి చేసి గాయపరచిన సంఘటన సోమవారం పత్తికొండ మండలం దూదేకొండ గ్రామంలో చోటుచేసుకొంది. బాధితురాలు ఆదిలక్ష్మి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దూదేకొండ గ్రామానికి చెందిన ఆదిలక్ష్మికి గ్రామకంఠం స్థలంలో గత ముప్పై ఏళ్ల క్రితం ప్రభుత్వ అధికారులు ఇంటి స్థలం కేటాయించారు. హౌసింగ్‌ కింద పక్కా ఇళ్లు మంజూరు కావడంతో ఇళ్లు నిర్మించుకుంది. అయితే అమె తన ఇంటి ముందు ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసి తన పేరున పట్టా పొందింది. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామానికి చెందిన వైసీపీ వర్గీయులైన రామాంజినేయులు (అప్పటి వలంటీర్‌) లతో పాటు పెద్దయ్య మరికొందరు కలసి ఆదిలక్ష్మి ఇంటి ముందు భాగాన షెడ్డు (రేకుల బంకు) వేశారు. దారికి అడ్డుగా తన ఇంటి ముందు తన స్థలంలోనే షెడ్డు ఎలా వేస్తారని నిలదీసింది. షెడ్డు నిర్మాణం పనులను చేపడుతుండగా అడ్డుకోబోయిన తనను కట్టెలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారని బాధిత మహిళ విలేకర్ల ఎదుట వాపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో దొంగ పట్టాలు సృస్టించుకొని, తన స్థలాన్ని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకొని, తనను, కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై సీఐ జయ్యన్నను వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 12:23 AM