మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kadapa: అసమ్మతి నేతలను బెదిరిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..

ABN, Publish Date - Feb 20 , 2024 | 04:08 PM

వైసీపీలో ఏళ్లుగా అసంతృప్తితో ఉంటూ.. బయటకి రావాలనుకుంటున్న కొందరు నేతలను వైసీపీ ఎమ్మెల్యే బెదిరించడం నివ్వెరపరుస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Kadapa: అసమ్మతి నేతలను బెదిరిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..

కడప: వైసీపీలో ఏళ్లుగా అసంతృప్తితో ఉంటూ.. బయటకి రావాలనుకుంటున్న కొందరు నేతలను వైసీపీ ఎమ్మెల్యే బెదిరించడం నివ్వెరపరుస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసమ్మతితో వారు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని స్థానిక మున్సిపల్ మహిళా కౌన్సిలర్‌పై బెదిరింపులకు దిగారు. తన పదవికి రాజీనామా చేసి ఆ తరువాతే టీడీపీలోకి వెళ్లాలని.. లేదంటే కౌన్సిలర్ అంతు చూస్తానని బెదరించారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే బెదిరింపుల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది.

Updated Date - Feb 20 , 2024 | 04:16 PM

Advertising
Advertising