ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ సోషల్‌ మీడియా ప్రతినిధి అరెస్టు.. బెయిల్‌

ABN, Publish Date - Oct 22 , 2024 | 03:51 AM

సీఎం చంద్రబాబును అవినీతిపరుడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన వైసీపీ సోషల్‌ మీడియా కంటెంట్‌ రైటర్‌ ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

గుడివాడ, అక్టోబరు21(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబును అవినీతిపరుడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన వైసీపీ సోషల్‌ మీడియా కంటెంట్‌ రైటర్‌ ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు మహిళ నాయకురాలు అసిలేటి నిర్మల గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలుమార్లు విచారణ నిమిత్తం పిలిచినా ఆయన స్పందించలేదు. దీంతో సెక్షన్లు 193, 353(2), 336(4), 340(2) కింద రవికిరణ్‌ను సోమవారం అరెస్టు చేశారు. అనంతరం న్యాయాధికారి ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఆ వెంటనే రూ.10 వేల డిపాజిట్‌, ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తులపై రవికిరణ్‌కు బెయిల్‌ మంజూరు చేశారు.

Updated Date - Oct 22 , 2024 | 03:51 AM