ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాఫియా మోడల్‌!

ABN, Publish Date - Dec 05 , 2024 | 05:38 AM

అధికారాన్ని ఉపయోగించుకుని ఇన్ని అరాచకాలు చేయొచ్చా? భయమూ బెరుకూ లేకుండా చెలరేగిపోవచ్చా? ప్రభుత్వంలో ఉన్నవారే ‘మాఫియా’ తరహాలో బెదిరింపులకు దిగవచ్చా? ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇవన్నీ జరిగాయి! ఒకటి కాదు..

వైసీపీ పాలనలో లూటీయే డ్యూటీ

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ గనుల లీజుదారులు, పారిశ్రామికవేత్తల జోలికి వెళ్లలేదు. వైసీపీ పెద్దలు మాత్రం ఒక పద్ధతి ప్రకారం పారిశ్రామిక వేత్తలను బెదిరించి మరీ వాటాలను, కంపెనీలను కబ్జా చేశారు. గనులను సొంతం చేసేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించారని, భూములు ఆక్రమించారని, ఫైన్లు వేస్తామని... ఇలా పలురకాలుగా వేధించి వాటాలు కొట్టేశారు.

వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌ రెడ్డి, విజయసాయిరెడ్డిలను రంగంలోకి దించి కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు, కాకినాడ సెజ్‌ను సొంతం చేసుకున్న వైనంపై అసలు వాటాదారుడు కేవీ రావు తాజాగా సీఐడీకి ఫిర్యాదు చేశారు. అదే విధంగా... ఇతర బాధితులూ భయం వీడి, ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

భయపెట్టి, బెదిరించి ఆస్తులు కైవసం

కాకినాడ పోర్టు, సెజ్‌లాంటివి ఎన్నో!

విశాఖ, కాకినాడపై ప్రత్యేక దృష్టి

వంతాడ గనుల్లో 89శాతం సొంతం

ఏటా రూ.180 కోట్ల సంపాదన

విశాఖ బేపార్కులో పెద్దల పాగా

రాడిసన్‌ బ్లూలో సగం స్వాహా

రామానాయుడు స్టూడియోలో ప్లాట్ల బేరం

(కాకినాడ/విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

ధికారాన్ని ఉపయోగించుకుని ఇన్ని అరాచకాలు చేయొచ్చా? భయమూ బెరుకూ లేకుండా చెలరేగిపోవచ్చా? ప్రభుత్వంలో ఉన్నవారే ‘మాఫియా’ తరహాలో బెదిరింపులకు దిగవచ్చా? ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇవన్నీ జరిగాయి! ఒకటి కాదు.. రెండు కాదు.. లెక్కలేనన్ని అరాచకాలు సాగాయి. ప్రధానంగా అయిదేళ్ల పాలనలో కాకినాడను కొల్లగొట్టారు. విశాఖపై ‘ప్రత్యేక’ దృష్టి సారించి... ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బెదిరించి భూములు, ప్రాజెక్టులు లాక్కోవడం విశాఖపట్నం నుంచే మొదలైంది. తొలి ప్రయత్నంగా ఓ ఎన్‌ఆర్‌ఐ ఇంటికి కడపకు చెందిన కొందరు వెళ్లి తుపాకీతో బెదిరించారు. రూ.100 కోట్ల విలువైన భూమిని వివాదంలోకి లాగకుండా ఉండాలంటే రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దానికి నిరాకరించడంతో వైసీపీ ప్రభుత్వం ఆ భూమి స్వాధీనానికి చర్యలు తీసుకుంది. వెరసి... ఆ బెదిరింపులకు సర్కారు పెద్దల ప్రత్యక్ష సహకారముందని అప్పుడే స్పష్టమైంది.

850 ఎకరాల మెట్టంతా మింగేశారు..

కాకినాడపై పడి సెజ్‌, పోర్టులు, లేటరైట్‌, బియ్యాన్ని మింగేసిన వైసీపీ పెద్దలు... పెద్దాపురం రామేశం మెట్టలో 850 ఎకరాల్లో విస్తరించిన కొండలను సైతం పిండేసి గుల్లచేసేశారు. అయిదేళ్లపాటు నిరంతరాయంగా గ్రావెల్‌ తవ్వకాలు జరిపి రూ.850కోట్లకుపైగా లూటీ చేసేశారు.


బే పార్క్‌ పూర్తిగా సొంతం

విశాఖ రుషికొండలో ఎకో టూరిజం ప్రాజెక్టు పేరుతో ఇండో అమెరికన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (బే పార్క్‌) రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం నుంచి 28 ఎకరాల భూమి లీజుకు తీసుకుంది. రూ.100 కోట్లకు పైగా వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో వెల్‌నెస్‌ సెంటర్‌ (ఆరోగ్య కేంద్రం) ఏర్పాటు చేసింది. ఇది మెడికల్‌ టూరిజం ప్రాజెక్టు. దానిపై వైసీపీ పెద్దల కన్ను పడింది. అంతే... డెవలపర్లను బెదిరించారు. ప్రాజెక్టు కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేదనే కారణం చూపించి... లీజు రద్దు చేస్తామని లొంగదీసుకున్నారు. ఆ రుణాలు తామే దశల వారీగా చెల్లిస్తామంటూ ఒప్పందం చేసుకొని అసలు యజమానులను గెంటేసి... ఆ ప్రాజెక్టును హస్తగతం చేసుకున్నారు. ఈ విషయంలో ఆర్థికంగా సహకరించిన హెటిరో డ్రగ్స్‌ కంపెనీకి నక్కపల్లిలో 81 ఎకరాల ప్రభుత్వ భూమిని నామమాత్రపు ధరకు కట్టబెట్టారు.

రామానాయుడు స్టూడియో భూముల్లో వాటాకు ఒత్తిడి

విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో రామానాయుడు స్టూడియోకు మధురవాడ సర్వే నంబర్లు 387, 393లలో 34.44 ఎకరాలను 2003లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిని సినిమా షూటింగ్‌లకే వినియోగించాలి. అందులో కొంతే వారు ఉపయోగించుకున్నారు. మూడొంతులు ఖాళీగా ఉంది. దానిపై వైసీపీ కీలకనేత కన్ను పడింది. ఖాళీగా ఉన్న భూమి వెనక్కి ఎందుకు తీసుకోకూడదంటూ బెదిరింపుల రాయబారం నడిపారు. అక్కడ లేఅవుట్‌ వేసి, అందులో సగం ప్లాట్లు తమకు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. అందుకు అనుగుణంగా ఆ ప్రాంతాన్ని వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌లో మిక్స్‌డ్‌ జోన్‌గా మార్చేశారు. దాంతో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ 15.18 ఎకరాల్లో 34 ప్లాట్లతో లేఅవుట్‌ వేసింది. అందులో సగం ప్లాట్లు బినామీల మీద రిజిస్టర్‌ చేయాల్సిందిగా వైసీపీ పెద్దలు ఒత్తిడి పెట్టారు. ఈలోగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. లేఔట్‌లో విక్రయాలపై కోర్టు ‘స్టే’ విధించింది.


వంతాడ వాటాలు కొట్టేశారిలా..

కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో వంతాడ గ్రామం లేటరైట్‌కు ప్రసిద్ధి. దీనిపై కన్నేసిన గత ప్రభుత్వ పెద్ద తన ప్రధాన అనుచరుడిని రంగంలోకి దించారు. ఇక్కడ కొండల్లో 200 ఎకరాల్లో ఇరవై ఏళ్లపాటు ఆండ్రూ మినరల్స్‌ అనే కంపెనీ తమ కుటుంబ సభ్యుల పేరిట ఆరు లీజుల వరకు దక్కించుకుంది. ఏడాదికి 20 లక్షల టన్నుల లేటరైట్‌ తవ్వితీస్తూ సిమెంట్‌ ఫ్యాక్టరీలకు, ఒడిసాలోని జిందాల్‌ స్టీల్‌ కంపెనీకి ఖనిజాన్ని విక్రయిస్తోంది. కాకినాడ పోర్టు నుంచి చైనా, హాంకాంగ్‌ దేశాలకు తరలించేది. ఈ కంపెనీ జగన్‌ ప్రభుత్వం రాకముందు ఐదేళ్లలో వందల కోట్ల వ్యాపారం చేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఇది బంగారు బాతు! దీనిపై వైసీపీ పెద్దల కన్ను పడింది. 2021లో లీజుదారుడిని ‘చర్చల’కు పిలిచారు. అప్పటి ‘పెద్ద’ మంత్రి తనయుడు, మరికొందరు కలిసి... ‘ఎంతోకొంత ఇస్తాం. వంతాడ గనులు మాకు వదిలేయండి’ అని హుకుం జారీ చేశారు. దీనికి లీజుదారుడు అంగీకరించలేదు. అంతే...పర్మిట్లు ఆగిపోయాయి. మైనింగ్‌ ఆగిపోయింది. ‘ఆండ్రూ’ యజమానికి దిక్కుతోచలేదు. కేంద్ర పర్యావరణ అనుమతులతో తవ్వకాలు జరుపుతున్నందున... తేడా వస్తే ఇరుక్కుపోతానని, మరో డీల్‌ చెప్పాలని వేడుకున్నాడు. దీంతో... ‘లీజు నీది. తవ్వకాలు మాత్రం మావి. లాభాల్లో 89శాతం మాకు. 11 శాతం నీకు’ అంటూ బలవంతపు డీల్‌ కుదిర్చారు. ఇలా పైసా పెట్టుబడి లేకుండా ఏటా రూ.180 కోట్లు పోగేసుకుంటున్నారు.

భారతి సిమెంట్‌ కోసం...

జగన్‌ అధికారంలో ఉండగా 2022లో ఉమ్మడి విశాఖ జిల్లా నాతవరం సరిహద్దులో లేటరైట్‌ గనులనూ కొల్లగొట్టేశారు. అక్కడ తవ్విన వేల మెట్రిక్‌ టన్నుల లేటరైట్‌ను ఆ జిల్లా మీదుగా కాకుండా సరిహద్దున ఉన్న కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మీదుగా రహస్యంగా తరలించడానికి స్కెచ్‌ వేశారు. కత్తిపూడి హైవే మీదుగా మూడో కంటికి తెలియకుండా భారతి సిమెంట్‌కు సరుకు పంపడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే... నాతవరం మండలం బమిడికలిద్ది నుంచి రౌతులపూడిలో లేటరైట్‌ నిల్వ చేసే ప్రదేశానికి మధ్య రిజర్వు ఫారెస్ట్‌ ఉంది. పైగా టిప్పర్ల రాకపోకలకు రహదారి లేదు. దీంతో ఏకంగా 12 కిలోమీటర్ల మేర రిజర్వు ఫారె్‌స్టను చీల్చి వందల చెట్లను నరికేసి అనుమతులు లేకుండా ఏకంగా రహదారి నిర్మించేశారు. లేటరైట్‌ను ఈ మార్గం ద్వారా తెచ్చి భారతి సిమెంట్‌ పేరుతో ఉన్న లారీల్లో దర్జాగా తరలించేశారు.


‘రాడిసన్‌’లో సగం వాటా వేరొకరికి అప్పగింత

విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో ‘కార్తీకవనం’ పేరుతో రెండు దశాబ్దాల క్రితం ఓ ప్రైవేటు సంస్థతో బీఓటీ ప్రాజెక్టుకు వీఎంఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. సాగర్‌ నగర్‌ దగ్గర బీచ్‌ను ఆనుకొని పది ఎకరాల స్థలాన్ని 33 ఏళ్ల లీజుకు ఇచ్చింది. అందులో అటవీ శాఖకు చెందిన భూమి కొంత ఉండడంతో నిర్మాణాలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు అవసరమయ్యాయి. ఆ తరువాత ఆ కంపెనీలో కొత్త భాగస్వాములు చేరి అనుమతులు తెచ్చుకొని నిర్మాణం పూర్తిచేశారు. అదే ‘రాడిసన్‌ బ్లూ హోటల్‌’. దానిపై వైసీపీ నేతల కన్నుపడింది. అంతే ఆ హోటల్‌ ప్రారంభం కాకుండా ఒక పోలీస్‌ అధికారి తాళాలు వేశారు. దీనిపై ప్రశ్నిస్తే... నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని బదులిచ్చారు. పెద్దలతో మాట్లాడుకోవాలని పరోక్షంగా సందేశాలు ఇచ్చారు. వారు చెప్పిన వారికి 50 శాతం వాటా ఇవ్వడానికి అంగీకరించడంతో ఆ హోటల్‌ ప్రారంభానికి అనుమతి ఇచ్చారు.

Updated Date - Dec 05 , 2024 | 08:11 AM