మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

ABN, Publish Date - Jun 03 , 2024 | 11:29 PM

గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసు కోవాలని పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ వి.జయరాజు కోరారు. స్థానిక పశు వైద్య కేంద్రంలో వైద్య శిబిరాన్ని సోమవారం పరిశీలించారు.

 పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

జలుమూరు: గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసు కోవాలని పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ వి.జయరాజు కోరారు. స్థానిక పశు వైద్య కేంద్రంలో వైద్య శిబిరాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జబ్బవాపు, చిటుక వ్యాధి నివారణ టీకాలపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. తొలకరి వర్షాలు పడుతున్నందున సాధారణంగా పశువుల్లో వచ్చే వ్యాధుల నివారణకు టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. టెక్కలి డివిజన్‌లో జబ్బవాపు వ్యాధి నివారణకు 53,520 డోసులకు గాను ఇప్పటి వరకు 48,976 డోసులు వాక్సిన్‌ వేసినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 19,980 డోసుల లక్ష్యాన్ని మించి వ్యాక్సిన్‌ వేశామన్నారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి ఏడీ మంద లోకనాథం, జలుమూరు పశువైద్యాధికారి ముద్దాడ దీప్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 11:29 PM

Advertising
Advertising