ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విమ్టా ల్యాబ్స్‌ లాభంలో 110% వృద్ధి

ABN, Publish Date - Nov 09 , 2024 | 06:04 AM

విమ్టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది.

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విమ్టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఏకంగా 109.9 శాతం వృద్ధి చెంది రూ.17 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.8.1 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా 26.4 శాతం వృద్ధితో రూ.67.6 కోట్ల నుంచి రూ.85.4 కోట్లకు చేరుకుందని కంపెనీ వెల్లడించింది. ఈ కాలంలో ఫార్మాస్యూటికల్‌ సర్వీసుల వ్యాపారం మంచి పనితీరు కనబరచటం ఎంతగానో కలిసివచ్చిందని పేర్కొంది. రానున్న త్రైమాసికాల్లో కొత్త ప్లాంట్‌ అందుబాటులోకి రానుండటంతో పాటు ఫార్మా సేవల వ్యాపారం ఇదే జోరును కొనసాగించే వీలుండటంతో మంచి ఫలితాలను నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

Updated Date - Nov 09 , 2024 | 06:04 AM