Bank Holidays: జూలై 2024లో బ్యాంకు సెలవులు..రాష్ట్రాల వారీగా పూర్తి జాబితా..
ABN, Publish Date - Jun 24 , 2024 | 01:11 PM
మరికొన్ని రోజుల్లో జూలై 2024(July 2024) నెల ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేయనున్నాయనే(bank working days) విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మరికొన్ని రోజుల్లో జూలై 2024(July 2024) నెల ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేయనున్నాయనే(bank working days) విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోకుండా మీరు మీ బ్యాంకు కార్యకాలపాలను సమర్థవంతంగా నిర్వహించలేరు.
మీకు బ్యాంకు పనులు(bank works) ఏదైనా ఉంటే ఈ సెలవులను చూసుకుని వెళ్తే ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అయితే జూలైలో గురు హరగోవింద్ జీ జయంతి, ముహర్రం వంటి పండుగలు ఉన్నాయి. ఇవి కాకుండా రెండవ, నాల్గవ శనివారం, ఆదివారం కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ క్రమంలో జూలైలో మొత్తం 12 రోజులు సెలవులు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
రాష్ట్రాల వారీగా జూలై 2024లో సెలవుల జాబితా
జూలై 3, 2024: Behdienkhlam పండుగ సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు
జూలై 6, 2024: MHIP డే సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు బంద్
జూలై 7, 2024: ఆదివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు
జూలై 8, 2024: కాంగ్ రథజాత్ర సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు హాలిడే
జూలై 9, 2024: ద్రుక్పా త్షే జీ సందర్భంగా గాంగ్‌టక్‌లోని బ్యాంకులు మూసివేయబడతాయి
జూలై 13, 2024: రెండో శనివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు
జూలై 14, 2024: ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
జూలై 16, 2024: హరేలా సందర్భంగా డెహ్రాడూన్‌లోని బ్యాంకులకు సెలవు
జూలై 17, 2024: ముహర్రం సందర్భంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. RBI జాబితా ప్రకారం, అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, పాట్నా, రాంచీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. పనాజీ, తిరువనంతపురం, కొచ్చి, కోహిమా, ఇటానగర్, ఇంఫాల్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, గౌహతి, చండీగఢ్, భువనేశ్వర్, అహ్మదాబాద్ బ్యాంకులు తెరిచి ఉంటాయి.
జూలై 21, 2024: ఆదివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి
జూలై 27, 2024: నాల్గవ శనివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు
జూలై 28, 2024: జూలై చివరి ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
బ్యాంకులకు సెలవుల జాబితా అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకారం అన్ని రాష్ట్రాలకు సెలవుల జాబితా భిన్నంగా ఉంటుందనేది గమనించాలి. బ్యాంకులు మూతపడినప్పటికీ ఖాతాదారులకు ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయి.
ఇది కూడా చదవండి:
Onion Prices: గుడ్ న్యూస్.. తగ్గనున్న ఉల్లి ధరలు, కారణమిదే
Next IPOs: ఐపీఓల వారం మళ్లీ వచ్చేసింది.. ఏకంగా 10..
For Latest News and Business News click here
Updated Date - Jun 24 , 2024 | 01:13 PM