‘ఆటో’ ఎగుమతుల్లో 14% వృద్ధి
ABN, Publish Date - Oct 21 , 2024 | 01:20 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో భారత్ నుంచి ఆటోమొబైల్ ఎగుమతులు 14ు పెరిగి 25,28,248కి చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఎగుమతైన వాహనాల సంఖ్య 22,11,457 యూనిట్లు...
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో భారత్ నుంచి ఆటోమొబైల్ ఎగుమతులు 14ు పెరిగి 25,28,248కి చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఎగుమతైన వాహనాల సంఖ్య 22,11,457 యూనిట్లు. ప్రధానంగా ప్రయాణికుల వాహనాలు, ద్విచక్ర వాహనాల ఎగుమతులు మొత్తం ఎగుమతుల్లో వృద్ధికి దోహదపడ్డాయి. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు కరెన్సీ విలువ క్షీణత ప్రభావం నుంచి బయటపడడంతో ఎగుమతులు పునరుజ్జీవం సాధించాయని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర అన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 01:20 AM