22% పెరిగిన డీ-మార్ట్ లాభం
ABN, Publish Date - May 05 , 2024 | 06:02 AM
డీ-మార్ట్ పేరుతో గొలుసుకట్టు సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్ లిమిటెడ్.. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.563 కోట్ల లాభాన్ని ప్రకటించింది...
న్యూఢిల్లీ: డీ-మార్ట్ పేరుతో గొలుసుకట్టు సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్ లిమిటెడ్.. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.563 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆర్జించిన రూ.460 కోట్ల లాభం తో పోలిస్తే 22.39 శాతం అధికమిది. కాగా, ఈ జనవరి-మార్చి కాలానికి సంస్థ ఏకీకృత ఆదాయం రూ.12,727 కోట్లకు పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ రూ.50,789 కోట్ల ఏకీకృత ఆదాయంపై రూ.2,536 కోట్ల లాభాన్ని గడించింది. ఏడాది కాలంలో సంస్థ మరో 41 కేంద్రాలను ప్రారంభించింది. దాంతో మొత్తం సూపర్ మార్కెట్ల సంఖ్య 365కు చేరుకుంది. దేశంలోని 23 నగరాలకు విస్తరించినట్లు కంపెనీ వెల్లడించింది.
Updated Date - May 05 , 2024 | 06:02 AM