నియోవాంటేజ్ పార్క్‌కు రూ.300 కోట్ల రుణం
ABN, Publish Date - Sep 18 , 2024 | 01:19 AM
హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో నియోవాంటేజ్ ఇన్నోవేషన్ పార్క్స్ సంస్థ ఏర్పాటు చేసే రియల్టీ ప్రాజెక్టుకు హెచ్‌ఎ్‌సబీసీ ఇండియా రూ.300 కోట్ల రుణం మంజూరు చేసింది. నియోవాంటెజ్ ఇన్నోవేషన్ పార్క్స్ ఈ రుణాన్ని...
న్యూఢిల్లీ: హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో నియోవాంటేజ్ ఇన్నోవేషన్ పార్క్స్ సంస్థ ఏర్పాటు చేసే రియల్టీ ప్రాజెక్టుకు హెచ్‌ఎ్‌సబీసీ ఇండియా రూ.300 కోట్ల రుణం మంజూరు చేసింది. నియోవాంటెజ్ ఇన్నోవేషన్ పార్క్స్ ఈ రుణాన్ని పాత రుణాల చెల్లింపునకు వినియోగిస్తుంది. ఇవాన్‌హో కేంబ్రిడ్జ్, అంతర్జాతీయ పీఈ సంస్థ లైట్‌హౌస్ కాంటన్ సంస్థలు సంయుక్తంగా నియోవాంటెజ్ ఇన్నోవేషన్ పార్క్స్‌ను ఏర్పాటు చేశాయి.
ఈ సంస్థ జినోమ్ వ్యాలీలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీల పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రాలకు అవసరమైన భవనాలు నిర్మించి అద్దెకు ఇస్తుంటుంది. ఇప్పటికే ఈ పార్కులో ఎనిమిది ప్రముఖ కంపెనీలు తమ ఆర్ అండ్ డీ కేంద్రాలు ఏర్పాటు చేశాయి.
Updated Date - Sep 18 , 2024 | 01:19 AM