కోటక్ బ్యాంక్ లాభంలో 5% వృద్ధి
ABN, Publish Date - Oct 20 , 2024 | 12:29 AM
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి గాను కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి రూ.3,344 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.15,900 కోట్లకు ఎగబాకింది...
న్యూఢిల్లీ: సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి గాను కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి రూ.3,344 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.15,900 కోట్లకు ఎగబాకింది. అందులో స్థూల వడ్డీ ఆదాయం రూ.13,216 కోట్లుగా, నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.7,020 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) మాత్రం 4.91 శాతానికి తగ్గింది. గత నెల చివరి నాటికి బ్యాంక్ స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 1.49 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.43 శాతానికి తగ్గాయి.
Updated Date - Oct 20 , 2024 | 12:36 AM