ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒమేగా హాస్పిటల్స్‌లోకి రూ.500 కోట్ల పెట్టుబడులు

ABN, Publish Date - Jun 20 , 2024 | 01:30 AM

మోర్గాన్‌ స్టాన్లీ ప్రైవేట్‌ ఈక్విటీ ఏషియా నిర్వహణలోని ఫండ్‌ నుంచి రూ.500 కోట్లు సమీకరించినట్లు హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఒమేగా హాస్పిటల్స్‌) బుధవారం ప్రకటించింది...

  • మోర్గాన్‌ స్టాన్లీ పీఈ ఏషియా ఫండ్‌ నుంచి సమీకరణ

  • తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్త విస్తరణ కోసం నిధుల వినియోగం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మోర్గాన్‌ స్టాన్లీ ప్రైవేట్‌ ఈక్విటీ ఏషియా నిర్వహణలోని ఫండ్‌ నుంచి రూ.500 కోట్లు సమీకరించినట్లు హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఒమేగా హాస్పిటల్స్‌) బుధవారం ప్రకటించింది. ఒమేగా హాస్పిటల్స్‌లోకి ఇదే తొలి ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ సహా దేశం అంతటా విస్తరించేందుకు ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే దక్షిణాదిలో మరిం త బలపడటానికి కూడా ఈ పెట్టుబడులు దోహదపడతాయని ఒమేగా హాస్పిటల్స్‌ పేర్కొంది.


గడిచిన కొన్నేళ్లలో దేశంలో కేన్సర్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, ఈ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత నాణ్య తా ప్రమాణాలతో పూర్తి స్థాయి వైద్య సేవలందించడమే తమ లక్ష్యమని ఒమేగా హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మోహన్‌ వంశీ అన్నారు. ఈ లక్ష్యం దిశగా మా ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు మోర్గాన్‌ స్టాన్లీ పీఈ ఏషియాతో భాగస్వామ్యం తోడ్పడనుందన్నారు. మరికొన్నేళ్లలో ఒమేగా హాస్పిటల్స్‌ను దేశంలోనే అతిపెద్ద కేన్సర్‌ కేర్‌ హాస్పిటళ్ల నెట్‌వర్క్‌గా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుత ఆసుపత్రులను మరింత విస్తరించడంతోపాటు మరిన్ని కొత్త హాస్పిటళ్ల ఏర్పాటుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయని ఒమేగా హాస్పిటల్స్‌ సీఈఓ డాక్టర్‌ నమ్రత అన్నారు.

గడిచిన ఏడాది కాలంలో భారత కేన్సర్‌ కేర్‌ హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌లో తమకిది రెండో పెట్టుబడి అని మోర్గాన్‌ స్టాన్లీ పీఈ ఏషియా ఎండీ అర్జున్‌ సైగల్‌ తెలిపారు. డాక్టర్‌ మోహన్‌ వంశీ, డాక్టర్‌ నమ్రత నేతృత్వంలో ఒమేగా హాస్పిటల్స్‌ మెరుగైన వృద్ధి అవకాశాలను కలిగి ఉందన్నారు.


రెండో పెద్ద కేన్సర్‌ కేర్‌ ఆస్పత్రి

కేన్సర్‌ బారిన పడిన వారికి పూర్తి స్థాయి సేవలందించేందుకు ప్రముఖ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ మోహన్‌ వంశీ నేతృత్వంలో ఒమేగా హాస్పిటల్స్‌ 2010 జూలైలో ప్రారంభమైంది. ప్రస్తుతం 10కి పైగా ఆస్పపత్రులు, 1,400కు పైగా పడకల సామర్థ్యం కలిగిన ఒమేగా హాస్పిటల్స్‌ దేశంలోనే రెండో అతిపెద్ద కేన్సర్‌ కేర్‌ హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌గా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఒమేగా హాస్పిటల్స్‌.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 450 పడకల సామర్థ్యం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కూడిన మల్టీ కేర్‌ సూపర్‌ స్పెషాలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌తో పాటు గుంటూరు, వైజాగ్‌, కర్నూలు, భీమవరం, కరీంనగర్‌లోనూ సంస్థ ఆస్పపత్రులను నిర్వహిస్తోంది. అంతేకాదు, మధ్యప్రదేశ్‌కు చెందిన జబల్‌పూర్‌, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు సైతం విస్తరించింది.

Updated Date - Jun 20 , 2024 | 01:30 AM

Advertising
Advertising