Swiggy ESOP: తంతే బూరల బుట్టలో పడ్డారు.. ఒక్కో స్విగ్గీ ఉద్యోగికి రూ. కోటి రూపాయలు
ABN, Publish Date - Nov 13 , 2024 | 02:18 PM
ప్రముఖ ఆన్ లైన్ పుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ అద్భుతం చేసింది. సంస్థ తీసుకున్న నిర్ణయం వేలాది మంది ఉద్యోగులను..
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ అనుకున్నంత పని చేసింది. రాత్రికి రాత్రి ఆ కంపెనీ ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది. స్విగ్గీ ఐపీఓ లిస్టింగ్ ఆ కంపెనీ ఉద్యోగులకు జాక్ పాట్ తగిలేలా చేసింది. ఒక్క రోజులోనే 500 మందిపై కనకవర్షం కురిపించింది. అందుకు స్విగ్గీ సంస్థ తీసుకున్న గొప్ప నిర్ణయమే కారణం. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్ కారణంగా 5వేల మంది ఉద్యోగులు కోట్లకు పడగలెత్తారు.
అందులో 500 మందికి ఒక్కో ఉద్యోగి కోటి చొప్పున అందుకోనున్నారు. ప్రస్తుతం కంపెనీ విలువ 12 బిలియన్లకు దగ్గరగా ఉంది. మిగిలిన అర్హులైన సిబ్బందికి రూ. 9వ వేల కోట్ల ఈఎస్ఓపీ పూల్ లో కొంత భాగాన్ని పంచుతారని తెలుస్తోంది. దీని ద్వారా అనేక సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన వారితో పాటు ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ప్రయోజనం పొందనున్నారు.
కంపెనీ విజయాన్ని క్యాష్ చేసుకోవడానికి స్విగ్గీ తమ ఉద్యోగులకు ఐపీఓ ద్వారా అరుదైన అవకాశాన్ని అందించింది. దీంతో వేల మంది ఉద్యోగుల కోటీశ్వరుల క్లబ్ లో చేరారు. తొలి రోజు ఈ కంపెనీ సబ్ స్ర్పిప్షన్లు నిరాశ పరిచినప్పటికీ.. చివరి రోజు భారీగా కొనుగోలు చేయడంతో 3.59 రెట్లు సబ్ స్ర్రిప్షన్ వచ్చింది.
ఐపీఓ కంటే ఎంతో ముందే తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఈ-సాప్స్) కింద పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది. బుధవారం స్విగ్గీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్టు అయ్యాయి.. ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్ రూ.390 వద్ద లిస్టయినా ఒక్కో ఉద్యోగి వద్ద ఉన్న షేర్ల సగటు విలువ రూ.1.8 కోట్లకు చేరుతుందని (మొత్తం విలువ రూ..9,000 కోట్లు) మార్కెట్ వర్గాలు వేసిన అంచనాలే నిజమయ్యాయి.
Gold and Silver Rates Today: మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Updated Date - Nov 13 , 2024 | 02:18 PM