ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్‌

ABN, Publish Date - Jul 20 , 2024 | 05:46 AM

ఈక్విటీ మార్కెట్లో నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఔటేజ్‌లో అంతర్జాతీయ మార్కెట్లలో పోటెత్తిన అమ్మకాలకు తోడు ఇటీవలి లాభాలను సొమ్ము చేసుకోవాలన్న ఆకాంక్షతో ఇన్వెస్టర్లు తెగబడి అమ్మకాలు సాగించడం మార్కెట్‌ను నష్టాల్లోకి

సెన్సెక్స్‌ 739 పాయింట్లు డౌన్‌

ముంబై: ఈక్విటీ మార్కెట్లో నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఔటేజ్‌లో అంతర్జాతీయ మార్కెట్లలో పోటెత్తిన అమ్మకాలకు తోడు ఇటీవలి లాభాలను సొమ్ము చేసుకోవాలన్న ఆకాంక్షతో ఇన్వెస్టర్లు తెగబడి అమ్మకాలు సాగించడం మార్కెట్‌ను నష్టాల్లోకి నెట్టింది. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ కౌంటర్‌లో జరిగిన అమ్మకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అయితే ట్రేడింగ్‌ ప్రారంభంలో సూచీలు జీవిత కాల గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 81,587.76 పాయింట్లు, నిఫ్టీ 24,854.80 పాయింట్ల జీవిత కాల గరిష్ఠ స్థాయిలను తాకాయి. కాని చివరికి సెన్సెక్స్‌ 738.81 పాయింట్ల నష్టంతో 80,604.65 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 844.36 పాయింట్లు దిగజారి 80,499.10 స్థాయిని తాకింది. ఇంట్రాడేలో 292.70 పాయిం ట్లు నష్టపోయి 24,508.15 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసిన నిఫ్టీ చివరికి 269.95 పాయింట్ల నష్టంతో 24,530.90 వద్ద ముగిసింది.. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 85.31 పాయింట్లు, నిఫ్టీ 28.75 పాయింట్లు లాభపడ్డాయి.

రూ.7.94 కోట్ల సంపద ఫట్‌

మార్కెట్లో ఏర్పడిన భారీ పతనంతో బీఎ్‌సఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌ విలువ ఒక్క రోజులోనే రూ.7.94 కోట్లు దిగజారింది. మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.4,46,38,826.75 కోట్ల వద్ద (5.34 లక్షల కోట్ల డాలర్లు) స్థిరపడింది.

Updated Date - Jul 20 , 2024 | 05:46 AM

Advertising
Advertising
<