TDS refund Status: టీడీఎస్ రిఫండ్ అయిందీ లేనిదీ ఇలా చేక్ చేసుకోండి!
ABN, Publish Date - Dec 10 , 2024 | 10:25 PM
రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు చెల్లింపుల స్టేటస్ ఏమిటో పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. పన్ను చెల్లింపులకు ముందుగానే ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ కింద మినహాయించుకునే మొత్తాన్ని టీడీఎస్ అని అంటారు. శాలరీలు, బ్యాంకు వడ్డీలు వంటి చెల్లింపులు టీడీఎస్ కోత ఉంటుంది. అయితే, టీడీఎస్ లెక్కింపుల్లో పొరపాట్లు, ఆదాయంలో మార్పులు, ఇతర అంశాల కారణంగా కొన్ని సార్లు టీడీఎస్ అధిక మొత్తంలో కట్ అవుతుంది. ఈ అదనపు మొత్తాన్ని ఆదాయాయపు పన్ను శాఖ రిఫండ్ చేస్తుంది. రిఫండ్ కోరుతూ చేసుకునే అభ్యర్థలను పూర్తిస్థాయిలో పరిశీలించాక ఆదాయపు పన్ను శాఖ అదనంగా చెల్లించిన పన్ను మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తుంది. ఇలా రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు చెల్లింపుల స్టేటస్ ఏమిటో పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు (Business News)
Amazon: క్విక్ కామర్స్‌లోకి అమెజాన్ ఎంట్రీ!
టీడీఎస్ రిఫండ్..
ఐన్‌కమ్ ట్యాక్స్ చట్టాల ప్రకారం, జీతాలు తీసుకునేవారు, ఫిక్స్‌డ్, సేవింగ్స్ డిపాజిట్‌దారులు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తులు ఆదాయానికి మించి టీడీఎస్ చెల్లించిన సందర్భాల్లో రిఫండ్‌కు అర్హులు. ఐటీఆర్ ఫైలింగ్ పూర్తయిన తరువాత టీడీఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు వచ్చిన క్లెయిమ్‌లను ఆదాయపు పన్ను శాఖ పరిశీలించాక రిఫండ్ ఇచ్చేదీ లేనిదీ వెల్లడిస్తుంది.
సాధారణంగా రిఫండ్ క్లెయిమ్‌ల పరిశీలన ఆయా సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు తరువాత ఆదాయపు పన్ను శాఖ రిఫండ్ క్లెయిమ్‌లను పరిశీలించి కొన్ని వారాలు మొదలు నెలల వ్యవధిలో రిఫండ్ మంజూరు చేస్తుంది. సాధారణంగా రిఫండ్ జారీకి 20 నుంచి 45 రోజుల పడుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అయితే, రిఫండ్ మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా అదనపు ధ్రువీకరణలు అవసరమైన సందర్భాల్లో మరింత ఎక్కువ సమయం పట్టొచ్చు. రిఫండ్ మొత్తం నేరుగా బ్యాంకు అకౌంట్‌కు ఎలక్ట్రానిక్ విధానంలో బదిలీ అవుతుంది. కాబట్టి, పన్ను చెల్లింపు దారులు తమ బ్యాంకు ఖాతా వివరాలను జాగ్రత్తగా సరిచూసుకుని సమర్పించాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
Flipkart: ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి ఝలక్.. అలా చేస్తే ఎక్స్ ట్రా ఛార్జీలు కట్టాల్సిందే..
టీడీఎస్ రిఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఇలా..
రిఫండ్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ముందుగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లాలి.
యూజర్ ఊడీ, పాస్‌వర్డ్, క్యాప్చా సాయంతో పోర్టల్‌లో లాగిన్ కావాలి.
అనంతరం, స్క్రీన్‌పై కనిపించే డ్యాష్ బోర్డులో ఈ-ఫైల్ ట్యాబ్‌ను ఎంచుకోవాలి. ఇందులోని ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి
ఆ తరువాత వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ ఆప్షన్‌ను ఎంచుకుంటే రిఫండ్ స్టేటస్ ఏంటో తెలుస్తుంది.
ఇక రిఫండ్ ప్రాసెస్డ్ అనే స్టేటస్ కనిపిస్తే త్వరలో బ్యాంకులో డబ్బు క్రెడిట్ అవుతుందని అర్థం. రిఫండ్ ఇష్యూడ్ అని కనిపిస్తే రిఫండ్ జారీ అయ్యిందని, త్వరలో అకౌంట్‌లో డబ్బులు కనిపిస్తాయని భావించాలి. నో డిమాండ్, నో రిఫండ్ అంటే మీరు అదనంగా పన్ను చెల్లించలేదని, వెనక్కు వచ్చే మొత్తం ఏమీ లేదని అర్థం. క్లెయిమ్‌లు ప్రాసెసింగ్ కుదరని సందర్భాల్లో రిఫండ్ ఫెయిల్యూర్ అన్న స్టేటస్ కనిపిస్తుంది. చివరిగా రిఫండ్ అండర్ ప్రాసెస్ అంటే మీ అభ్యర్థన పరిశీలనలో ఉందని అర్థం.
ఇక బ్యాంకు వివరాలు సరిగా లేకపోవడం, అదనపు సమాచారం కావాల్సి రావడం వంటి సందర్భాల్లో రిఫండ్ జారీలో జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో పన్ను చెల్లింపుదారులు నేరుగా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. లేదా, ఈఫైలింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
Updated Date - Dec 10 , 2024 | 10:27 PM