ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tax Dispute: రూ.1 పన్ను వివాదం పరిష్కారం కోసం ఛార్టెడ్ అకౌంటెంట్‌కి రూ.50 వేలు చెల్లింపు!

ABN, Publish Date - Jul 10 , 2024 | 08:50 PM

కేవలం ఒక్క రూపాయి విలువైన పన్ను వివాదం పరిష్కారానికి ఏకంగా రూ.50 వేలు చెల్లించానని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి చెబుతున్నాడు.

కేవలం ఒక్క రూపాయి విలువైన పన్ను వివాదం పరిష్కారానికి ఏకంగా రూ.50 వేలు చెల్లించానని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి చెబుతున్నాడు. ఢిల్లీకి చెందిన అపూర్వ్ జైన్ అనే వ్యక్తి.. ఈ మధ్య ఆదాయపు పన్ను శాఖ నుంచి తనకు నోటీసు అందిందని, పన్ను వివాదం విలువ కేవలం ఒక్క రూపాయి మాత్రమేనని, అయితే దీనిని పరిష్కరించుకునేందుకు తాను ఏకంగా రూ.50,000 వెచ్చించానంటూ సోషల్ మీడియా వేదికగా తన గోడు వెల్లబోసుకున్నాడు. తాను తమాషా చేయడంలేదని, నిజమని పేర్కొన్నాడు.


నిరాశ వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా అపూర్వ్ జైన్ పెట్టిన ఈ పోస్టు వైరల్‌గా మారింది. దేశంలో పన్నుల వ్యవస్థ, పన్నుల వివాదాల పరిష్కారంలో ఉన్న సంక్లిష్టతలను ఈ ఘటన తెలియజేస్తోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. చిన్న సమస్యకైనా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తోందని పలువురు పేర్కొన్నారు. ఇది ఆదాయ పన్నుల విభాగం అసమర్థత అని పలువురు విమర్శించారు. కాగా జైన్ పోస్టుపై పలువురు విభిన్నంగా స్పందించారు. సీఏ (ఛార్టెడ్ అకౌంటెంట్) ఫీజు నిర్మాణాన్ని ప్రశ్నించారు. ఆదాయ పన్ను విభాగం పరిస్థితి జోక్ కాకపోతే మరేంటి? అని ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు. ఇక ధనిక రైతులకు ఆదాయపు పన్ను నోటీసులు పంపించే కోసం తాను ఎదురు చూస్తున్నానంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. రూ.50,000 ఛార్జీ చాలా ఎక్కువ, ఈ రోజుల్లో సీఏలు ఏదైనా అడిగేలా ఉన్నారంటూ మరో నెటిజన్ వ్యాంగ్యాస్త్రాలు సంధించారు.


ఇదిలావుంచితే పన్ను మినహాయింపులు, తగ్గింపుల కోసం తప్పుడు క్లెయిమ్‌లతో ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవద్దని చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. అటువంటి చర్యలకు పాల్పడితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, జరిమానాలు లేదా జైలు శిక్షకు కూడా దారి తీస్తుందని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలసిందే.

For more Business News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 08:50 PM

Advertising
Advertising
<