హై రిస్క్ పెట్టుబడుల కోసం కొత్త అసెట్ క్లాస్
ABN, Publish Date - Jul 17 , 2024 | 05:36 AM
మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్), పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసె్‌స (పీఎంఎస్) మధ్య అంతరాన్ని పూడ్చేందుకు కొత్త అసెట్ క్లాస్‌ను ప్రవేశపెట్టాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం ప్రతిపాదించింది...
ప్రవేశపెట్టే యోచనలో సెబీ
కనీస పెట్టుబడి రూ.10 లక్షలు జూ గరిష్ఠం రూ.50 లక్షలు
ఎంఎఫ్, పీఎంఎస్ మధ్య అంతరాన్ని పూడ్చేందుకే..
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్), పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసె్‌స (పీఎంఎస్) మధ్య అంతరాన్ని పూడ్చేందుకు కొత్త అసెట్ క్లాస్‌ను ప్రవేశపెట్టాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం ప్రతిపాదించింది. అధిక రిస్క్ తీసుకోగలిగే ఇన్వెస్టర్ నుంచి కనీసం రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల స్థాయి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ అసెట్ క్లాస్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది.అయితే, రూ.10 లక్షల కనీస పెట్టుబడి పరిమితి ద్వారా అధిక రిస్క్ తీసుకోలేని చిన్న మదుపరులను ఈ అసెట్ క్లాస్‌కు దూరంగా ఉంచనుంది. అనధికారిక, అన్ రిజిస్టర్డ్ పీఎంఎస్ ప్రొవైడర్ల సేవలందుకుంటున్న వారి పెట్టుబడులను కొత్త అసెట్ క్లాస్ వైపు మళ్లించడమే తమ ఉద్దేశమని చర్చా పత్రంలో సెబీ పేర్కొంది. ఎంఎఫ్ నిర్మాణంలోనే కొత్త అసెట్ క్లాస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు, క్రమానుగుత పెట్టుబడుల (సిప్) వెసులుబాటు కూడా కల్పించనున్నట్లు తెలిపింది. అంతేకాదు, నూతన అసెట్ క్లాస్ ఇన్వెస్టర్లు డెరివేటివ్‌ల్లోనూ పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించాలనుకుంటోంది.
రీట్స్, ఇన్విట్స్ నిబంధనల సవరణ
రియల్ ఎస్టేట్ ఇన్వె్‌స్టమెంట్ ట్రస్ట్స్ (రీట్స్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్).. యూనిట్ బేస్డ్ ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్ పథకాన్ని అమలు చేసేందుకు సెబీ విధివిధానాలను జారీ చేసింది. రీట్స్, ఇన్విట్స్ ఎంప్లాయీ బెనిఫిట్ ట్రస్ట్‌కు ఏ విధంగా యూనిట్లను కేటాయించాలి.. ట్రస్ట్‌లు ఏ విధంగా యూనిట్లను స్వీకరించాలనే విషయాలను కొత్త నియమావళి ద్వారా తెలియజేసింది.
పేటీఎంకు సెబీ హెచ్చరిక
డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ పేటీఎం బ్రాండ్ యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కు సెబీ హెచ్చరిక లేఖ జారీ చేసింది. ఆడిట్ కమిటీ లేదా షేర్‌హోల్డర్ల ఆమోదం లేకుండానే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)తో 2021-22 ఆర్థిక సంవత్సరంలో నెరిపిన రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి సెబీ ఈ లేఖలో హెచ్చరించింది. దాంతో పేటీఎం షేరు బీఎ్‌సఈలో 2 శాతం క్షీణించి రూ.459.75 వద్ద ముగిసింది.
Updated Date - Jul 17 , 2024 | 05:36 AM