ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒక రాష్ట్రానికి ఒకే ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌

ABN, Publish Date - Nov 06 , 2024 | 01:19 AM

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీ)ను మరింత పటిష్ఠం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహణలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) ఇప్పటికే నాబార్డ్‌తో...

ఆర్‌ఆర్‌బీలు 28కి కుదింపు

రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీ)ను మరింత పటిష్ఠం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహణలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) ఇప్పటికే నాబార్డ్‌తో కలిసి చర్చా పత్రాన్ని సిద్ధం చేసింది. దీనిపై ఈ నెల 20వ తేదీలోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని ఆయా ఆర్‌ఆర్‌బీలను స్పాన్సర్‌ చేసిన బ్యాంకులకు డీఎఫ్‌ఎస్‌ లేఖలు రాసింది. ప్రస్తుతం దేశంలో 43 ఆర్‌ఆర్‌బీలు పని చేస్తున్నాయి. వీటిని రాష్ట్రానికి ఒకటి చొప్పున 28కి కుదించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల వీటి నిర్వహణా సామర్ధ్యం పెరగడంతో పాటు ఖర్చుల హేతుబద్దీకరణ జరిగి తమ నిర్దేశిత లక్ష్యాలను సమర్ధవంతంగా నిర్వహిస్తాయని అధికార వర్గాలు చెప్పాయి. 2004-05 ఆర్థిక సంవత్సరం తర్వాత ఆర్‌ఆర్‌బీలను కుదించడం ఇది నాలుగోసారి అవుతుంది.


ఏపీజీవీబీ ఆస్తుల విభజనే సమస్య

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ (ఏపీజీబీ), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌ (సీడీజీబీ), సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ (సీజీబీ), ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) ఏపీ విభాగం పేరుతో నాలుగు ఆర్‌ఆర్‌బీలు ఉన్నాయి. ఇందులో ఏపీజీవీబీ అతిపెద్ద ఆర్‌ఆర్‌బీ. మిగతా మూడు ఆర్‌ఆర్‌బీలను ఏపీజీబీలో విలీనం చేయాలని ప్రభు త్వం ప్రతిపాదించింది. ఇందులో ఏపీజీబీని కెనరా బ్యాంక్‌ స్పాన్సర్‌ చేస్తుండగా సీడీజీబీకి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సీజీబీకి ఇండియన్‌ బ్యాంక్‌, ఏపీజీవీబీకి భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్‌బీఐ) స్పాన్సర్‌ బ్యాంకులుగా ఉన్నాయి. కాగా ఈ నాలుగు ఆర్‌ఆర్‌బీలకు కెనరా బ్యాంక్‌ను స్పాన్సర్‌ బ్యాంక్‌గా చేయాలని ప్రభుత్వం చర్చాప్రత్రంలో ప్రతిపాదించింది. అయితే ఏపీజీవీబీ ఆస్తుల పంపకం ఏపీజీవీబీ-తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ (టీజీబీ)ల మధ్య కొద్దిగా సమస్యగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.


ఈ పంపకం తేలిన తర్వాత ఈ మార్పులు జరుగుతాయని అధికార వర్గాలు చెప్పాయి. తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం ఏపీజీవీబీతో పాటు ఎస్‌బీఐ స్పాన్సర్‌ చేసిన టీజీబీ కూడా పని చేస్తోంది. ఆస్తుల విభజన తర్వాత ఏపీజీవీబీ తెలంగాణ శాఖలను టీజీబీలో విలీనం చేస్తారు.

Updated Date - Nov 06 , 2024 | 01:19 AM