Ambani Family: దేశంలో సంపన్న వ్యాపార కుటుంబాల్లో అంబానీ ఫ్యామిలీ టాప్.. తర్వాత స్థానాల్లో
ABN, Publish Date - Aug 08 , 2024 | 08:51 PM
అంబానీ కుటుంబం(Ambani family) తాజాగా అరుదైన ఘనతను సాధించింది. 309 బిలియన్ డాలర్ల (రూ.25.75 లక్షల కోట్లు) సంపదతో దేశంలోనే అత్యంత ధనిక వ్యాపార కుటుంబంగా నిలిచింది. ఈ క్రమంలో అంబానీ కుటుంబ వ్యాపారం విలువ భారతదేశ జీడీపీలో పదో వంతుకు సమానం కావడం విశేషం. ఇంకా ఈ జాబితాలో ఎవరెవరో చోటు దక్కించుకున్నారో చుద్దాం.
అంబానీ కుటుంబం(Ambani family) తాజాగా అరుదైన ఘనతను సాధించింది. 309 బిలియన్ డాలర్ల (రూ.25.75 లక్షల కోట్లు) సంపదతో దేశంలోనే అత్యంత ధనిక వ్యాపార కుటుంబంగా నిలిచింది. ఈ క్రమంలో అంబానీ కుటుంబ వ్యాపారం విలువ భారతదేశ జీడీపీలో పదో వంతుకు సమానం కావడం విశేషం. అంబానీ కుటుంబం తర్వాత బజాజ్ కుటుంబం(bajaj family) దేశంలో రెండో అత్యంత ధనిక ఫ్యామిలీగా నిలిచింది. వీరి వ్యాపార విలువ రూ. 7.13 లక్షల కోట్లు. ఆ తర్వాత రూ. 5.39 లక్షల కోట్లతో బిర్లా ఫ్యామిలీ(birla family) మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈ మూడు కుటుంబాల ఉమ్మడి సంపద $460 బిలియన్లు అంటే ఇది సింగపూర్ మొత్తం GDPకి సమానంగా ఉంది. ఈ విషయాన్ని హురున్ ఇండియా మోస్ట్ వాల్యూబుల్ ఫ్యామిలీ బిజినెస్ రిపోర్ట్ 2024 మొదటిసారిగా వెల్లడించింది.
మొదటి తరం జాబితాలో
ఇక నాల్గో స్థానంలో సజన్ జిందాల్(sachin jindal) నేతృత్వంలోని జిందాల్ కుటుంబం రూ. 471,200 కోట్లతో ఉంది. నాడార్ కుటుంబం మొత్తం రూ.430,600 కోట్ల సంపదతో ఐదో స్థానంలో ఉంది. రూ. 345,200 కోట్ల ఆస్తులతో మహీంద్రా కుటుంబం ఆరో స్థానంలో ఉంది. మరోవైపు 15.44 లక్షల కోట్లతో మొదటి తరం వ్యాపార కుటుంబాలలో అదానీ కుటుంబం మొదటి స్థానంలో ఉంది. సిరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను నిర్వహిస్తున్న పూనావాలా కుటుంబం రెండో స్థానంలో ఉంది. వీరి వ్యాపారం విలువ రూ.237,100 కోట్లు. ఈ జాబితాలో చేర్చబడిన అన్ని కుటుంబాల మొత్తం సంపద సుమారు 1.3 ట్రిలియన్ డాలర్లు ఇది స్విట్జర్లాండ్, UAE ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ కావడం విశేషం.
ప్రముఖుల పేర్లు
జిందాల్ కుటుంబం (JSW స్టీల్), నాదర్ కుటుంబం (HCL టెక్నాలజీస్), మహీంద్రా కుటుంబం (మహీంద్రా & మహీంద్రా), డానీ, చోక్సీ, వకీల్ కుటుంబాలు (ఆసియన్ పెయింట్స్), ప్రేమ్‌జీ కుటుంబం (విప్రో), రాజీవ్ సింగ్ కుటుంబం, మురుగప్ప కుటుంబం (ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా) సహా ఇతర ప్రముఖుల పేర్లు ఈ జాబాతాలో ఉన్నాయి. ఈ జాబితాలో చేర్చబడాలంటే కుటుంబంలోని తదుపరి తరం సభ్యుడు తప్పనిసరిగా వ్యాపార నిర్వహణలో చురుకుగా పాల్గొనాలి లేదా బోర్డులో సేవ చేయాలి. ఈ వాల్యుయేషన్‌లు మార్చి 20, 2024 వరకు డేటా ఆధారంగా తీసుకోబడింది.
ఈ నివేదికను ప్రారంభించిన సందర్భంగా హురున్ ఇండియా వ్యవస్థాపకుడు, ప్రధాన పరిశోధకుడు అనాస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడారు. భారతదేశ కుటుంబ వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థకు హార్ట్ లాంటిదని అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థలో కుటుంబ వ్యాపార పాత్రను ఎత్తిచూపడమే ఈ నివేదిక ఉద్దేశమని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
Home Loans: ఈ హోమ్ లోన్స్ తీసుకునే వారికి షాకింగ్... ఆర్బీఐ కీలక నిర్ణయం
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Aug 08 , 2024 | 08:54 PM