ఈనెల 25 నుంచి అఫ్కాన్స్ ఐపీఓ
ABN, Publish Date - Oct 20 , 2024 | 12:31 AM
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన అఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. సెబీకి సమర్పించిన పత్రాల (ఆర్‌హెచ్‌పీ) ప్రకారం.. ఐపీఓ ద్వారా...
న్యూఢిల్లీ: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన అఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. సెబీకి సమర్పించిన పత్రాల (ఆర్‌హెచ్‌పీ) ప్రకారం.. ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.5,430 కో ట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందులో రూ.1,250 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత వాటాదారులకు చెందిన రూ.4,180 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పద్ధతిన విక్రయించనుంది.
ఎస్‌ఎంపీపీ రూ.4,000 కోట్ల ఇష్యూ: రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎస్‌ఎంపీపీ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి అనుమతి కోరుతూ క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓ ద్వారా రూ.4,000కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Updated Date - Oct 20 , 2024 | 12:31 AM