ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జికా వైరస్‌ బారి నుంచి కాపాడే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు (ఐసీఎంఆర్‌)తో ఒప్పందం

ABN, Publish Date - Sep 13 , 2024 | 05:00 AM

జికా వైరస్‌ బారి నుంచి కాపాడే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)తో ఒప్పందం (ఎంఓఏ) కుదుర్చుకున్నట్లు...

  • జికా వైరస్‌ బారి నుంచి కాపాడే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)తో ఒప్పందం (ఎంఓఏ) కుదుర్చుకున్నట్లు ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) గురువారం ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా జికా వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం తాము జరిపే క్లినికల్‌ ట్రయల్స్‌ మొదటి దశ వ్యయాన్ని ఐసీఎంఆర్‌ భరించనుంది.

  • మారుతి సుజుకీ మార్కెట్లోకి సరికొత్త ఎపిక్‌ స్విఫ్ట్‌ ఎస్‌-సీఎన్‌జీ విడుదల చేసింది. మూడు వేరియంట్లలో ఈ హ్యాచ్‌బ్యాక్‌ కారు అందుబాటులో ఉండనుంది. ఒక కేజీ సీఎన్‌జీతో 32.85 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని మారుతి సుజుకీ వెల్లడించింది. ఈ కారు ధరలు రూ.81.9 లక్షల నుంచి 9.19 లక్షల మధ్యన ఉన్నాయి.

  • బ్రిగేడ్‌ గ్రూప్‌.. హైదరాబాద్‌లో బిజ్‌వర్క్స్‌ పేరుతో ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ప్లే్‌సలోకి అడుగుపెట్టింది. హైటెక్‌ సిటీ లో అరో ఆర్బిట్‌లో మొత్తం 25 వేల చదరపు అడుగుల్లో ఈ వర్క్‌ప్లే్‌సను ఏర్పాటు చేసింది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వర్క్‌ప్లే్‌సను 10 లక్షల చదరపు అడుగులకు విస్తరించాలని బ్రిగేడ్‌ గ్రూప్‌ భావిస్తోంది.


  • కిష్ణ డైమండ్‌ అండ్‌ గోల్డ్‌ జువెలరీ.. హైదరాబాద్‌లో కొత్తగా 2షోరూమ్‌లు ప్రారంభించింది. ఏఎస్‌ రావు నగర్‌, సోమాజీగూడలో ఈ షోరూమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్స్‌తో హైదరాబాద్‌లో స్టోర్ల సంఖ్య నాలుగుకు చేరుకోగా దేశవ్యాప్తంగా 38కి చేరుకున్నాయి.

  • గృహ నిర్మాణ రంగంలోని బ్రిక్‌ అండ్‌ బోల్ట్‌.. హైదరాబాద్‌లో కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నిర్మాణ సొల్యూషన్స్‌ను ఈ సెంటర్‌ అందించనుంది.

  • మొక్కజొన్న, సోయాబీన్‌ కోసం అడ్వాన్స్‌డ్‌ కీటక నాశిని ప్రొక్లెయిమ్‌ ఎక్స్‌ట్రాను క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ విడుదల చేసింది. 30, 150, 300 ఎంఎ ల్‌, లీటర్‌ ప్యాక్‌ సైజుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

Updated Date - Sep 13 , 2024 | 05:00 AM

Advertising
Advertising