Fastag: ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు అలర్ట్..కేవైసీ లింక్ లేకుంటే డీయాక్టివేట్!
ABN, Publish Date - Jan 16 , 2024 | 03:40 PM
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) RBI మార్గదర్శకాల ప్రకారం KYCని అప్‌డేట్ చేయాలని ఫాస్ట్‌ట్యాగ్(Fastag) వినియోగదారులను ఆదేశించింది. ఇది చేయకుంటే KYC లింక్ లేని కార్డులు జనవరి 31, 2024 తర్వాత డియాక్టివేట్ చేయబడతాయని ప్రకటించింది.
వాహన టోల్ పన్నును సులభంగా చెల్లించడానికి టోల్ పాయింట్ల వద్ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక వాహనం, ఒక ఫాస్ట్‌ట్యాగ్(Fastag) అనే కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. అయితే ఫాస్ట్‌ట్యాగ్ కార్డ్‌ని బహుళ వాహనాలకు ఉపయోగించలేరు. ఒకే వాహనంలో ఒక ఫాస్ట్‌ట్యాగ్ కార్డ్‌ని మాత్రమే వినియోగించాలి.
అయితే ఈ విధానం అమలు చేయడానికి NHAI ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు 'నో యువర్ కస్టమర్' (KYC)ని పూర్తి చేయాలని సూచించింది. జనవరి 31 లోపు కేవైసీ పూర్తి చేయకపోతే ఆ తర్వాత వారి కార్డులు డీయాక్టివేట్ అవుతాయని అధికారులు ప్రకటించారు. అంతేకాదు తగినంత బ్యాలెన్స్ ఉన్నా కానీ KYC లింక్ సరిగా లేకుంటే వాటిని బ్లాక్‌లిస్ట్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
FASTagతో సహా అనేక రకాల సేవలను ఉపయోగించడానికి KYC అవసరం. దీంతో ఈ కంపెనీలు మీరు ఎవరో తెలుసుకోగలుగుతాయి. దీని కారణంగా లావాదేవీలు సురక్షితంగా ఉంటాయి. మీ పేరు, చిరునామా లేదా ఏదైనా ఇతర సమాచారం మారితే, వాటిని త్వరగా అప్‌డేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు సమీపంలోని టోల్ ప్లాజాకు లేదా వారి సంబంధిత జారీ చేసే బ్యాంకుల టోల్ ఫ్రీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
మీ ఫాస్ట్‌ట్యాగ్ KYCని ఇలా కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు
1- మీ ఫాస్ట్‌ట్యాగ్‌ని జారీ చేసిన బ్యాంకును సంప్రదించండి
2- సమీపంలోని బ్యాంక్ శాఖకు వెళ్లండి
3- KYC అప్‌డేట్ ఫారమ్‌ని తీసుకోండి
4- ఫారమ్‌ను మీ వివరాలతో పూర్తి చేయండి
5- ఫారమ్‌ను అక్కడి బ్యాంక్ సిబ్బందికి సమర్పించండి
Updated Date - Jan 16 , 2024 | 03:40 PM