ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బంగారం, వెండి ఆల్‌టైం రికార్డు

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:07 AM

దేశీయంగా బులియన్‌ ధరలు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ డేటా ప్రకారం.. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర సోమవారం రూ.750 పెరిగి రూ.80,650కి...

సిల్వర్‌ ఒక్కరోజే రూ.5,000 అప్‌

కిలో ధర రూ.99,500కు చేరిక

రూ.80,000 దాటిన పసిడి రేటు

న్యూఢిల్లీ: దేశీయంగా బులియన్‌ ధరలు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ డేటా ప్రకారం.. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర సోమవారం రూ.750 పెరిగి రూ.80,650కి చేరింది. 10 గ్రాముల పసిడి రూ.80,000 స్థాయిని దాటడం ఇదే తొలిసారి. వెండి ధర ఏకంగా రూ.5,000 ఎగబాకి రూ.99,500కు చేరుకుంది. వెండి ధర పెరగడం వరుసగా ఇది నాలుగో రోజు. మరోవైపు హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.220 పెరుగుదలతో రూ.79,640కి, 22 క్యారెట్ల రేటు రూ.200 పెరిగి రూ.73,000 చేరకున్నాయి. కిలో వెండి రూ.2000 ఎగబాకి రూ.1,09,000 ధర పలికింది.


సిల్వర్‌కు చైనా బూస్ట్‌

అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ విలువైన లోహాల ధరలు సరికొత్త జీవితకా గరిష్ఠాలకు ఎగబాకాయి. ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ఒక దశలో దాదాపు 26 డాలర్ల పెరుగుదలతో 2,755 డాలర్లకు చేరుకోగా.. వెండి ఒక శాతం పెరిగి 12 ఏళ్ల గరిష్ఠ స్థాయి 34.49 డాలర్లకు పుంజుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (పీబీఓసీ) ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించడం ప్రస్తుత ర్యాలీకి కారణమని బులియన్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ముఖ్యంగా పీబీఓసీ వడ్డీ రేటు తగ్గించడం చైనాలో పారిశ్రామిక రంగానికి ఊతమివ్వనుందని, తద్వారా పారిశ్రామిక అవసరాలకు వెండి వినియోగం మరింత పెరగవచ్చన్న అంచనాలతో ఈ లోహం ధర అమాంతం దూసుకుపోయింది.


బులియన్‌ రేట్లు మరింత పైపైకే

నవంబరులో అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంకైన ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలు, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు బులియన్‌ ధరలను కొత్త గరిష్ఠాలకు చేర్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్‌ గోల్డ్‌ 2,800 డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనాలున్నాయి.

మూడేళ్ల గరిష్ఠానికి ఆర్‌బీఐ బంగారం కొనుగోళ్లు

ఆర్‌బీఐ తన వద్దనున్న విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలను వివిధీకరించడంతో పాటు అంతర్జాతీయ అనిశ్చితులు, సంక్షోభాల నుంచి నిల్వలకు రక్షణ కల్పించేందుకు బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆర్‌బీఐ 54.7 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. గడిచిన మూడేళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి కొనుగోళ్లు. దాంతో ఈ ఏడాదిలో ఆర్‌బీఐ వద్దనున్న బంగారం నిల్వలు 7 శాతం పెరిగి మొత్తం 858.3 టన్నులకు చేరుకున్నాయి. ఈ ఏడాది అత్యధికంగా బంగారం కొనుగోళ్లు జరిపిన ప్రపంచ దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌ల్లో ఆర్‌బీఐ ఒకటని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది.

Updated Date - Oct 22 , 2024 | 01:07 AM