ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prime Day Sale: షాపింగ్ ప్రియులకు అమెజాన్ నుంచి ఓ గుడ్ న్యూస్!

ABN, Publish Date - Jul 02 , 2024 | 05:43 PM

షాపింగ్ ప్రియులకు ఓ గుడ్‌న్యూ్స్. త్వరలో ప్రైమ్ డే సేల్ ప్రారంభిస్తున్నట్టు అమెజాన్ తాజాగా ప్రకటించంది. రెండు రోజుల పాటు సాగే ఈ సేల్‌ కేవలం ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే పరిమితం. కొత్త వారు ప్రైమ్‌సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఇందులో పాల్గొనచ్చు.

ఇంటర్నెట్ డెస్క్: షాపింగ్ ప్రియులకు ఓ గుడ్‌న్యూ్స్. త్వరలో ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) ప్రారంభిస్తున్నట్టు అమెజాన్ తాజాగా ప్రకటించంది. రెండు రోజుల పాటు సాగే ఈ సేల్‌ కేవలం ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే పరిమితం. జులై మూడో వారంలో ప్రైమ్ డే సేల్ ప్రారంభమవుతుందని అమెజాన్ పేర్కొంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌ు సహా పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి ఉంటాయి. అంతేకాకుండా, బ్యాంకులు, ఇతర లెండర్ల భాగస్వామ్యంలో కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు అందించేందుకు కూడా సంస్థ ఏర్పాట్లు చేసింది.

జులై 20 నుంచి 48 గంటల పాటు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా పలు కొత్త ఉత్పత్తులు కూడా లాంచ్ కానున్నాయి. ఈ సేల్ సందర్భంగా చెల్లింపుల కోసం ఐసీఐసీఐ సహా కొన్ని బ్యాంకు కార్డులు వినియోగించిన వారికి అదనంగా 10 డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే క్రెడిట్ కార్డు వినియోగదారులకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.


అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఉద్దేశించిన ఈ సేల్‌లో కొత్తవారు ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ప్రయోజనం పొందొచ్చు. ప్రస్తుతం భారత్‌లో ప్రైమ్ మెంబర్ షిప్ నెలకు రూ.299లకు అందుబాటులో ఉంది. మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌కు రూ.599, ఏడాదికి రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది వ్యవధికి అమెజాన్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ రూ.399కు లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు కొన్ని ఎంపిక చేసిన వస్తువులను త్వరగా డెలివరీ పొందొచ్చు. ప్రైమ్ వీడియో ద్వారా కొత్త సినిమాలు, టీవీ షోలు చూడొచ్చు.

Read Business and Latest News

Updated Date - Jul 02 , 2024 | 05:45 PM

Advertising
Advertising