Ambani family : ప్రపంచ సంపన్నుల్లో అంబానీ కుటుంబం
ABN, Publish Date - Dec 14 , 2024 | 06:00 AM
ప్రపంచ కుబేర కుటుంబాల సంపద ఏటికేటికీ పెరిగి పోతోంది. అమెరికా రిటైల్ దిగ్గజం ‘వాల్‌మార్ట్’ వ్యవస్థాపకులు వాల్టన్ కుటుంబం ఈ విషయంలో 43,240 కోట్ల డాలర్ల (సుమారు రూ.36.65 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది.
రూ.8.44 లక్షల కోట్లతో ఎనిమిదో స్థానం
షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికీ చోటు: బ్లూమ్‌బర్గ్
న్యూయార్క్: ప్రపంచ కుబేర కుటుంబాల సంపద ఏటికేటికీ పెరిగి పోతోంది. అమెరికా రిటైల్ దిగ్గజం ‘వాల్‌మార్ట్’ వ్యవస్థాపకులు వాల్టన్ కుటుంబం ఈ విషయంలో 43,240 కోట్ల డాలర్ల (సుమారు రూ.36.65 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద (44,700 కోట్ల డాలర్లు) కంటే కొద్దిగా తక్కువ. పశ్చిమాసియాలోని రాజ కుటుంబాల అందరి సంపదలతో పోలిస్తే మాత్రం వాల్టన్ కుటుంబ ఆస్తులే ఎక్కువ. దీనికి సంబంధించి బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ తాజాగా ‘ప్రపంచ సంపన్న కుటుంబాలు, 2024’ పేరుతో ఒక జాబితా విడుదల చేసింది.
అంబానీలకూ చోటు: ఈ జాబితాలో మన దేశానికి చెందిన రెండు కుటుంబాలకు చోటు దక్కింది. అంబానీ కుటుంబం 9,960 కోట్ల డాలర్ల (సుమారు రూ.8.44 లక్షల కోట్లు) సంపదతో ఎనిమిదో స్థానం సంపాదించింది. ఆ తర్వాత 4,140 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.5 లక్షల కోట్లు) సంపదతో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన మిస్త్రీ కుటుంబం 23వ స్థానంలో నిలిచింది.
Updated Date - Dec 14 , 2024 | 06:00 AM