ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమెరికా మార్కెట్‌కు అమూల్‌ పాలు

ABN, Publish Date - Mar 26 , 2024 | 01:33 AM

దేశంలో అతిపెద్ద పాల ఉత్పత్తుల బ్రాండ్‌ అమూల్‌.. అతి త్వరలో అమెరికా మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. వారం రోజుల్లో కంపెనీకి చెందిన తాజా పాల ఉత్పత్తులను అమెరికాలో విడుదల చేయనున్నట్లు అమూల్‌ బ్రాండ్‌ నిర్వహణదారైన...

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద పాల ఉత్పత్తుల బ్రాండ్‌ అమూల్‌.. అతి త్వరలో అమెరికా మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. వారం రోజుల్లో కంపెనీకి చెందిన తాజా పాల ఉత్పత్తులను అమెరికాలో విడుదల చేయనున్నట్లు అమూల్‌ బ్రాండ్‌ నిర్వహణదారైన గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎ్‌ఫ) తెలిపింది. దశాబ్దాలుగా డైరీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నప్పటికీ తాజా పాలను విదేశాల్లో లాంచ్‌ చేయడం మాత్రం ఇదే తొలిసారని జీసీఎంఎంఎఫ్‌ ఎండీ జయేన్‌ మెహతా అన్నారు. యూఎ్‌సలోని భారతీయులు, మిగతా ఆసియా దేశాల వారి కోసం వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన చెప్పారు. అమూల్‌ తాజా, గోల్డ్‌, శక్తి, స్లిమ్‌ అండ్‌ ట్రిమ్‌ పాలప్యాకెట్లను న్యూయార్క్‌, న్యూజెర్సీ, షికాగో, వాషింగ్టన్‌, డల్లాస్‌, టెక్సాస్‌ తదితర నగరాల్లో విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. భవిష్యత్‌లో అమూల్‌ పనీర్‌, పెరుగు, బటర్‌మిల్క్‌ను సైతం లాంచ్‌ చేయాలనుకుంటున్నట్లు మెహతా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో జీసీఎంఎంఎఫ్‌ టర్నోవర్‌ వార్షిక ప్రాతిపదికన 18.5 శాతం వృద్ధితో రూ.55,000 కోట్లకు చేరుకుంది. ఈ సంస్థ ఇప్పటికే 50 దేశాలకు డైరీ ఉత్పత్తులను ఎగమతి చేస్తోంది.

Updated Date - Mar 26 , 2024 | 01:33 AM

Advertising
Advertising