Ayodhya: రామయ్య ప్రాణ ప్రతిష్ఠపై వ్యాపారవేత్తలు ఆనంద్ మహీంద్ర, గౌతమ్ అదానీ ఏమన్నారంటే..?
ABN, Publish Date - Jan 23 , 2024 | 08:11 AM
కోట్లాది రామ భక్తుల కళ సోమవారంతో నెరవేరింది. శ్రీరామచంద్రుడు తన జన్మస్థలమైన అయోధ్యలో కొలువుదీరాడు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యర్యంలో జరిగిన ఈ వేడుకకు 7 వేల మందికిపైగా అతిథులను ఆహ్వానించారు.
అయోధ్య: కోట్లాది రామ భక్తుల కళ సోమవారంతో నెరవేరింది. శ్రీరామచంద్రుడు తన జన్మస్థలమైన అయోధ్యలో కొలువుదీరాడు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యర్యంలో జరిగిన ఈ వేడుకకు 7 వేల మందికిపైగా అతిథులను ఆహ్వానించారు. ఈ అద్భుత ఘట్టంపై అనేక మంది ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్తలు ఆనంద్ మహీంద్ర, గౌతమ్ అదానీ కూడా ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు.
శ్రీరాముడు మతానికి అతీతుడు
‘‘మన విశ్వాసాలు ఏవైనా.. గౌరవం, విలువలతో జీవించడానికి అంకితమైన మహోన్నత వ్యక్తి శ్రీరాముడు.. ఆయన మతానికి అతీతడు.. ఆయన బాణాలు చెడు, అన్యాయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ‘రామరాజ్యం’ అనే ఆదర్శ పాలన భావనే నేడు సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్ష. ఇప్పుడు ‘రామ్’ అనే పదం ప్రపంచానికి చెందింది.’’ అని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.
అయోధ్య మందిరం మతసామరస్యానికి ప్రతీక
‘‘అయోధ్య రామమందిరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. పవిత్రమైన ఈ రోజున తెరుచుకుంటున్న మందిర తలుపులు జ్ఞానోదయం, శాంతికి ప్రవేశ ద్వారంగా ఉండాలి. తద్వారా భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సామరస్యం ఈ సమాజాన్ని కాలతీత బంధంతో ఏకం చేయాలని కాంక్షిద్దాం.’’ అని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
ఇలాంటి మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 23 , 2024 | 09:04 AM