Apple: ఆపిల్‌కు భారీ షాక్.. ఏకంగా రూ.16,500 కోట్ల జరిమానా.. కారణం ఇదే!
ABN, Publish Date - Mar 04 , 2024 | 10:21 PM
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్‌కు (Apple) తాజాగా భారీ షాక్ తగిలింది. యూరోపియన్ ఎకనామిక్ ఏరియా(EEA)లోని ఐఫోన్ (iPhone), ఐపాడ్ (iPad) వినియోగదారులకు.. దాని యాప్ స్టోర్ (App Store) మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ల పంపిణీకి సంబంధించిన యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను.. యూరోపియన్ కమిషన్ 1.8 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.16,500 కోట్లకు పైమాటే) జరిమానా విధించింది.
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్‌కు (Apple) తాజాగా భారీ షాక్ తగిలింది. యూరోపియన్ ఎకనామిక్ ఏరియా(EEA)లోని ఐఫోన్ (iPhone), ఐపాడ్ (iPad) వినియోగదారులకు.. దాని యాప్ స్టోర్ (App Store) మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ల పంపిణీకి సంబంధించిన యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను.. యూరోపియన్ కమిషన్ 1.8 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.16,500 కోట్లకు పైమాటే) జరిమానా విధించింది. యాప్ స్టోర్ వెలుపల అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ, చౌకైన సంగీత సబ్‌స్ర్కిప్షన్ సేవల గురించి iOS వినియోగదారులకు నిరోధించిందని.. యాప్ డెవలపర్స్‌పై యాపిల్ ఈ మేరకు పరిమితులు విధించిందని కమిషన్ కనుగొంది.
గత పదేళ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతోందని.. ఫలితంగా మ్యూజిక్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌ల కోసం iOS వినియోగ దారులు ఎక్కువ మొత్తం చెల్లించి ఉండొచ్చని యూరోపియన్ యూనియన్ యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ తెలిపింది. యాప్ స్టోర్ ద్వారా మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ల పంపిణీ కోసం.. ఒక దశాబ్దం నుంచి మార్కెట్‌లో ఆపిల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని కమిషన్ వైస్ ప్రెసిడెంట్ మార్గరెట్ వెస్టేజర్ పేర్కొన్నారు. అవసరమైన నిబంధనలను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి పద్ధతులను మానుకోవాలని తాము ఆపిల్‌ను ఆదేశించామని చెప్పారు. అయితే.. యాపిల్ సంస్థ కమిషన్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. తాము కమిషన్‌ని గౌరవిస్తామని.. అయితే వినియోగదారులకు హాని కలిగించే విశ్వసనీయ సాక్ష్యాలను వెలికితీయడంలో కమిషన్ విఫలమైందని పేర్కొంది. తాము దీనిని అప్పీల్ చేస్తామని ఉద్ఘాటించింది.
ఇదిలావుండగా.. 2019లో స్పాటిఫై ఫిర్యాదు చేయగా, 2021లో ఐఫోన్ తయారీదారుపై విస్తృత కమీషన్ దర్యాప్తును ప్రారంభించింది. అయితే.. గతేడాదిలో ఈ దర్యాప్తు కాస్త స్తబ్దుగా సాగింది. యాప్ స్టోర్‌పై బలమైన నియంత్రణ కలిగిన యాపిల్ సంస్థ.. ప్రత్యామ్నాయ ఎంపిక సమాచారాన్ని పరిమితం చేసి, తన సొంత సేవల్ని అధిక ధరలకు మెయింటెయిన్ చేస్తోంది. దీంతో.. యూజర్లు తప్పని పరిస్థితుల్లో అధిక ధరలకే మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ పొందాల్సి ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. తన బిజినెస్ పెంచుకోవడం కోసం, ఇతర మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లకు యాపిల్ సంస్థ అవకాశం కల్పించలేదు.
Updated Date - Mar 04 , 2024 | 10:21 PM