ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాహన రంగానికి పండగ కళ

ABN, Publish Date - Nov 16 , 2024 | 05:47 AM

ఆటోమొబైల్‌ రంగానికి పండగల సీజన్‌ బాగా కలిసొచ్చింది. 42 రోజుల పాటు సాగిన పండగల సీజన్‌లో ఆటోమొబైల్‌ కంపెనీలు 42,88,248 వాహనాలు విక్రయించాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో విక్రయించిన 38,37,040 యూనిట్లతో

అమ్మకాల్లో 12 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ రంగానికి పండగల సీజన్‌ బాగా కలిసొచ్చింది. 42 రోజుల పాటు సాగిన పండగల సీజన్‌లో ఆటోమొబైల్‌ కంపెనీలు 42,88,248 వాహనాలు విక్రయించాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో విక్రయించిన 38,37,040 యూనిట్లతో పోల్చితే అమ్మకాలు 12 శాతం పెరిగినట్టు భారత ఆటోమొబైల్‌ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) తెలిపింది. ఇదే కాలంలో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 7 శాతం పెరిగి 5,63,059 యూనిట్ల నుంచి 6,03,009 యూనిట్లకు పెరిగాయి. ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్లు కూడా 14 శాతం పెరిగి 29,10.141 యూనిట్ల నుంచి 33,11,325 యూనిట్లకు చేరాయి.

మార్కెట్లో అందుబాటులో ఉన్న అసాధారణ డిస్కౌంట్లు, కొంతకాలం పాటు కొనసాగిన నిస్తేజం అనంతరం డిమాండులో పునరుజ్జీవం విక్రయాలు పెరగడానికి దోహదపడ్డాయని పేర్కొంది. ప్రధానంగా నవరాత్రి సమయంలో అధిక సంఖ్యలో వాహనాలు విక్రయించగలిగామని ఫాడా ప్రెసిడెంట్‌ సీఎస్‌ విఘ్నేశ్వర్‌ తెలిపారు. అకాల వర్షాలు సృష్టించిన అలజడి గనుక లేకపోయి ఉంటే తాము 45 లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించే వారమన్నారు. అయితే వాస్తవ ఇన్వెంటరీ గణాంకాలు ఈ నెలాఖరుకు తెలుస్తాయని ఫాడా తెలిపింది.

Updated Date - Nov 16 , 2024 | 05:48 AM