అవీవా ఎక్స్‌పీరియన్స్ సెంటర్
ABN, Publish Date - May 03 , 2024 | 05:40 AM
ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో కీలకంగా ఉన్న అవీవా.. హైదరాబాద్‌లో కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. కంపెనీకిది ఆరో సెంటర్...
హైదరాబాద్: ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో కీలకంగా ఉన్న అవీవా.. హైదరాబాద్‌లో కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. కంపెనీకిది ఆరో సెంటర్. ప్రస్తుతం కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఐదు టెక్నాలజీ హబ్స్‌ను నిర్వహిస్తోంది. కంపెనీకి చెందిన ఈ అడ్వాన్స్‌డ్ ఆర్ అండ్ డీ ల్యాబ్స్‌లో 1,200కు పైగా టెక్నాలజి్‌స్టలు పనిచేస్తున్నారు. అవీవా గ్లోబల్ వ్యాపారంలో భారత్ చాలా కీలకంగా ఉందని, ఇందులో హైదరాబాద్, బెంగళూరు నగరాల పాత్ర ఎంతో ముఖ్యమైనదని సంస్థ సీఓఓ సు క్వెన్స్ అన్నారు. హైదరాబాద్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇండస్ట్రియల్ ఆర్ అండ్ డీ సహా భవిష్యత్ వ్యాపార అవసరాల కోసం డిజిటల్ ఇన్నోవేషన్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Updated Date - May 03 , 2024 | 05:40 AM